‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Feb 25 2026 10:32 AM | Updated on Feb 25 2026 10:32 AM

‘సాక్

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

సిరిసిల్ల: కోనరావుపేట మండలం బావుసాయిపేట జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి విద్యార్థులకు హెచ్‌ఎం పి.శ్రీనివాస్‌ మంగళవారం ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు సీహెచ్‌ రాజు, యాదగిరి, ఎల్‌ రవి, సీహెచ్‌ చంద్రశేఖర్‌, లక్ష్మీనారాయణ, ఉమాకర్‌ పాల్గొన్నారు.

సీఎంను కలిసిన విప్‌

వేములవాడ: సీఎం రేవంత్‌రెడ్డిని మంగళవారం హైదరాబాద్‌లో విప్‌ ఆది శ్రీనివాస్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం సాధించినందుకు విప్‌ను సీఎం అభినందించారు. వేములవాడ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎంను కోరగా, సానుకూలంగా స్పందినట్లు విప్‌ తెలిపారు.

టాస్క్‌ఫోర్స్‌ ఆకస్మిక తనిఖీలు

వేములవాడ: నకిలీ సిగరేట్లు విక్రయిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని టాస్క్‌ఫోర్స్‌ సీఐ నటేశ్‌ అన్నారు. మంగళవారం వేములవాడ పట్టణంలో పలు కిరాణా, సూపర్‌ మార్కెట్‌, పాన్‌షాప్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో నకిలీ సిగరేట్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు వేములవాడలో తనిఖీలు చేశామని, ప్రముఖ బ్రాండ్ల పేర్లతో నకిలీ సిగరేట్లు విక్రయించడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. నకిలీ సిగరేట్ల తయారీ, విక్రయాలపై సమాచారం ఉంటే సమీప పోలీస్‌స్టేషన్‌కు తెలియజేయాలని కోరారు. టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది తిరుపతి, రాజేశ్‌, శ్రీనివాస్‌, శివ పాల్గొన్నారు.

న్యాయవాదుల విధుల బహిష్కరణ

వేములవాడ: నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ కోర్టులో ప్రాక్టీస్‌ చేస్తున్న జి.కళ్యాణిపై ఈనెల 22న దుండగులు దాడి చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గుడిసె సదానందం ఆధ్వర్యంలో అడ్వకేట్లు మంగళవారం కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ, మహిళా న్యాయవాదిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని, న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలులోకి తేవాలని డిమాండ్‌ చేశారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, న్యాయవాదులు నాగుల సత్యనారాయణ నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌, పిట్టల మనోహర్‌, పెంటరాజు, కొడిమ్యాల పురుషోత్తం, అంజయ్య, దేవేందర్‌, జక్కుల పద్మ, స్రవంతి, అపర్ణ, నయిమానాసారి తదితరులు పాల్గొన్నారు.

ఆసియా పారాగేమ్స్‌ ఎంపిక కమిటీ సభ్యుడిగా బాబు

రుద్రంగి(వేములవాడ): రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అంతర్జాతీయ పారా వాలీబాల్‌ కోచ్‌ సింగారపు బాబుకు అరుదైన గౌరవం దక్కింది. జపాన్‌లో జరగనున్న ఆసియా పారా గేమ్స్‌ కోసం భారత జట్టును ఎంపిక చేసే కమిటీ సభ్యుడిగా పారాలింపిక్‌ కమిటీ ఆఫ్‌ ఇండియా అతడిని నామినేట్‌ చేసింది. సింగారపు బాబుకు మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగి, భారత జట్టు ఎంపికలో కీలక పాత్ర పోషించనుండటంపై స్థానిక ప్రజలు, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ1
1/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ2
2/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ3
3/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ4
4/4

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement