కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర | - | Sakshi
Sakshi News home page

కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర

Aug 25 2025 9:19 AM | Updated on Aug 25 2025 9:19 AM

కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర

కష్టాలను తెలుసుకునేందుకే జనహిత యాత్ర

పదేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు జనహిత పాదయాత్రలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ రోల్‌మోడల్‌గా చొప్పదండి: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఉత్సాహంగా సాగిన పాదయాత్ర

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌/గంగాధర:

ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునేందుకు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకునేందుకు జనహిత పాదయాత్ర చేపట్టామని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం చొప్పదండి నియోజకవర్గంలో చేపట్టిన జనహిత పాదయాత్రలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి పాల్గొన్నారు. గంగాధర మండలం ఉప్పర మల్యాల నుంచి గంగాధర మధురానగర్‌ చౌరస్తా వరకు పాదయాత్ర సాగింది. మహిళలు బోనాలతో, ఒగ్గుడోలు కళాకా రులు, విద్యార్థులు, ప్రజలు ఘనస్వాగతం పలికా రు. మధురానగర్‌ చౌరస్తాలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, రాజ్‌ఠాకూర్‌, మాజీ ఎంపీ వీహెచ్‌, మాజీ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తదితరులతో కలిసి మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ప్రసంగించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లపై దుమ్మెత్తి పోశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి ఇదే గంగాధరలో విజయోత్సవాలు చేసుకుందామని ప్రకటించారు.

రోల్‌మోడల్‌గా చొప్పదండి: ఎమ్మెల్యే సత్యం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రుల సహకారంతో చొప్పదండ నియోజకవర్గాన్ని రోల్‌ మోడల్‌గా తీర్చి దిద్దుతానని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నా రు. పాదయాత్ర అనంతరం మధురానగర్‌ చౌరస్తాలో నిర్వహించిన సభలో ఎమ్మెల్యే సత్యం మాట్లాడారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి శూన్యం అన్నారు. పదేళ్ల పాలనలో ఒక్క ఇళ్లు ఇవ్వలేదని, కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే ప్రతి గ్రా మానికి ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందన్నారు. చురుగ్గా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. తొమ్మిది రో జుల్లో తొమ్మిదివేల కోట్ల రూపాయల రైతు భరోసా నిధులు విడుదల చేశామన్నారు. రూ.21వేల కోట్ల రుణమాఫీ చేశామని, 60వేల ఉద్యోగాలు, అర్హులందరికీ రేషన్‌కార్డులు, కార్డులున్న వారికి సన్న బియ్యం ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదన్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అదనంగా చుక్కా నీరు ఇవ్వలేదన్నారు. ఎవరు అడ్డుపడినా నియోజకవర్గ అభివృద్ధి ఆగదన్నారు. నారాయణపూర్‌ రిజర్వాయర్‌ కట్ట ఎత్తు పెంచి, నిర్వాసితులకు పరిహారంతో పాటు వ్యవసాయానికి నీరు అందిస్తామన్నారు. త్వరలోనే గంగాధరలో డిగ్రీ కళాశాల మంజూరు చేస్తానన్నారు. కొండగట్టు అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల మంజూరు అయిందని తెలిపారు.

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం

మండలంలోని కురిక్యాలలో ఇందిరమ్మ పథకంలో బాలగోని భాగ్య– గంగయ్య దంపతులు నిర్మించుకున్న ఇంటిని పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్‌తో పాటు మంత్రులు గృహ ప్రవేశం చేశారు. సొంత ఇల్లు కట్టుకున్నందుకు సంతోషంగా ఉందని, పదేళ్లుగా రేషన్‌ కార్డు రాలేదని, కాంగ్రెస్‌ వచ్చాక రేషన్‌ కార్డు వచ్చిందని భాగ్య దంపతులు భావోద్వేగంతో కంటతడి పెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement