
వర్కర్ టు ఓనర్ అందించాలి
సిరిసిల్లటౌన్: వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే ప్రారంభించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూషం రమేశ్ కోరారు. బీవై నగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. వర్కర్ టు ఓనర్ పథకం ప్రారంభించాలని కోరారు. పవర్‌లూమ్ పరిశ్రమపై అదనంగా విధిస్తున్న బ్యాక్ బిల్లింగ్ చార్జీలతో వస్త్ర పరిశ్రమ ఇబ్బందుల్లో పడుతుందన్నారు. ఈనెల 26న సిరిసిల్లకు వస్తున్న మంత్రులు వర్కర్ టు ఓనర్, బ్యాక్ బిల్లింగ్ సమస్యను పరిష్కరించాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.