
టీచర్లకు పదోన్నతులు
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని సెకండరీ టీచర్లకు స్కూల్ అసిస్టెంట్ టీచర్లుగా, పలువురికి ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతులు కల్పించేందుకు ఆదివారం కలెక్టరేట్‌లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ జరిగింది. కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా విద్యాధికారి వినోద్‌కుమార్ ఆధ్వర్యంలో ధ్రువీకరణపత్రాలను పరిశీలించి, పదోన్నతులు కల్పించారు. గణితం 8 మంది, ఫిజిక్స్ 4, బయాలజీ 8, సోషల్ స్టడీస్ 9, హిందీ పండిట్ 5, ఇంగ్లిష్ 6, ఫిజికల్ డైరెక్టర్ 2, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఒకరికి పదోన్నతి లభించినట్లుగా అధికారిక గణాంకాలు తెలుపుతున్నాయి.
సిరిసిల్లఅర్బన్: జిల్లా కేంద్రం శివారులోని పెద్దూరులో గల మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల హాస్టల్‌ను మార్చాలని కోరుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆదివారం నిరసన తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ హాస్టల్‌లో 379 మంది విద్యార్థులు ఉండగా కేవలం 8 గదులు మాత్రమే ఉన్నాయన్నారు. హాస్టల్‌లో వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. పిల్లలను చూస్తామని ప్రిన్సిపాల్‌ను కోరితే కలెక్టర్ అనుమతి తీసుకొని రావాలంటున్నారన్నారు. గేటుకు తాళాలు వేసి పిల్లలను కలువనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అన్ని వసతులు ఉన్న భవనంలోకి హాస్టల్‌ను మార్చాలని కోరారు. పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఆందోళన విరమింపజేయించారు.