సూక్ష్మకళ.. భళా | - | Sakshi
Sakshi News home page

సూక్ష్మకళ.. భళా

Aug 15 2025 7:20 AM | Updated on Aug 15 2025 7:20 AM

సూక్ష

సూక్ష్మకళ.. భళా

ఓదెల(పెద్దపల్లి): మడక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్‌ మొనపై 4 మి.మీ. పొడవు, 2 మి.మీ. వెడల్పుతో అతిచిన్న జాతీయ జెండా రూపొందించారు. ఇందుకోసం సుమారు గంట సమయం తీసుకున్నారు. చాక్‌పీస్‌పై 7 మి.మీ. పొడవు, 5 మి.మీ. వెడల్పుతో గంట పది నిమిషాలపాటు శ్రమించి చెక్కారు. చాక్‌పీస్‌పై హ్యాపీ ఇండిపెండెన్స్‌డే ఆంగ్ల అక్షరాలు చెక్కి శుభాకాంక్షలు చెక్కారు. వీటిని వివిధ బుక్‌ ఆఫ్‌ రికార్డులకు ప్రతిపాదించినట్లు రజనీకాంత్‌ తెలిపారు.

సూక్ష్మకళ.. భళా 1
1/1

సూక్ష్మకళ.. భళా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement