
నేడు సిరిసిల్లలో కృష్ణాష్టమి వేడుకలు
సిరిసిల్లటౌన్: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా జిల్లా కేంద్రం సిరిసిల్లలో శుక్రవారం కన్నులపండువగా వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఇస్కాన్ ఇన్‌చార్జి ప్రాణనాథ అచ్యుతదాస్ అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కళ్యాణలక్ష్మి గార్డెన్‌లో నిర్వహించే వేడుకల్లో గురుపూజ, హరేకృష్ణ మంత్ర జపాలు, రాధాకృష్ణులకు ఉయ్యాల సేవ, మహా నైవేద్యాలు, హారతి, కుంభహారతి, మహాభిషేకం, పుష్పాభిషేకం, సాంస్కృతిక కార్యక్రమాలు, సంకీర్తనలు జరుగుతాయన్నారు. ఇస్కాన్ ప్రతినిధులు నరుత్తమదాస్, హరిహరదాసు, మధుసూధన్‌దాస్, రసానంద ప్రియదాస్ తదితరులు పాల్గొన్నారు.