
లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్‌కు రాష్ట్రపతి పతకం
మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఫైర్ స్టేషన్‌లో లీడింగ్ ఫైర్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న వహిదుల్లాఖాన్ అత్యున్నత పురస్కారమైన రాష్ట్రపతి పతకానికి ఎంపికయ్యారు. 1986లో ఫైర్‌మెన్‌గా అగ్ని మాపక శాఖలో చేరిన ఆయన.. ఆసిఫాబాద్, ఇచ్చోడ, ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్‌లో పని చేసి.. రెండేళ్ల క్రితం మెట్‌పల్లికి బదిలీపై వచ్చారు. 2015లో లీడింగ్ ఫైర్‌మెన్‌గా పదోన్నతి పొందారు. మొదటి నుంచి అంకితభావంతో పనిచేసే ఆయన విపత్తుల సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తారనే పేరు సంపాదించారు. అత ని సేవలకు గుర్తింపుగా ఇప్పటివరకు ఆరు ప్రశంసపత్రాలు, ఒక సేవాపతకం ప్రదానం చేశారు. ప్రస్తుతం రాష్ట్రపతి పతకానికి ఎంపిక కావడంపై ఆయనను ఉన్నతాధికారులు అభినందించారు.
లీడింగ్ ఫైర్‌మెన్ గోపాల్‌రెడ్డికి..
జమ్మికుంట: జమ్మికుంట పట్టణ అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్‌మెన్‌గా విధులు నిర్వహిస్తున్న బీరెడ్డి గోపాల్‌రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఫైర్‌మెన్‌గా విధుల్లో అత్యంత ఉత్తమ సేవలు అందించినందుకు రాష్ట్రపతి అవార్డుకు ఎంపికయ్యారు. ఫైర్ ఆఫీసర్‌గా విధుల్లో క్రమ శిక్షణ, నిబద్ధతతో పని చేసినందుకు అవార్డుకు ఎంపికై నట్లు గోపాల్‌రెడ్డి తెలిపారు.

లీడింగ్ ఫైర్ ఆఫీసర్ వహిదుల్లాఖాన్‌కు రాష్ట్రపతి పతకం