
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
వేములవాడ: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం వేములవాడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్హులైన 40 మంది సీఎంఆర్‌ఎఫ్ లబ్ధిదారులకు రూ.12.96లక్షల విలువ గల చెక్కులు అందజేశారు. వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని అన్నారు. పేదలకు వైద్య పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా పదేళ్లలో రూ. 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు రూ.800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్