
రూ.1,947కే ఆరోగ్య పరీక్షలు
కరీంనగర్‌టౌన్: స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని మెడికవర్ ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీ ప్రవేశ పెట్టిందని ఆస్పత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ తెలిపారు. స్థానిక ఆస్పత్రిలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వందేమాతరం హెల్త్ చెకప్ ప్యాకేజీ పేరిట అందుబాటులోకి తీసుకొచ్చిన పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలను రూ.1,947 చెల్లించి పొందవచ్చన్నారు. కార్డియాలజీ, జనరల్ ఫిజీషియన్, డైటీషియన్ కన్సల్టేషన్‌తోపాటు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ), కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్(సీయూఈ), పాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్ టెస్ట్(ఎల్‌ఎఫ్‌టీ), ఎక్స్‌రే చెస్ట్ (విత్‌అవుట్ ఫిలిం), ఈసీజీ, 2డీ ఎకో, హెపటైటిస్‌బీఏ1సి, సీరం యూరియా, అల్ట్రాసౌండ్ స్కానింగ్ (అబ్డొమెన్– పెల్విస్), సీరం క్రియాటినిన్ పరీక్షలు ఈ ప్యాకేజీ ద్వారా నిర్వహిస్తామని వివరించారు. ఈ ప్యాకేజీ సెప్టెంబర్ 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
విషజ్వరంతో ఒకరి మృతి
సారంగాపూర్: మండల కేంద్రానికి చెందిన మోతుకు గంగమల్లు (55) విషజ్వరంతో బాధపడుతూ గురువారం మృతిచెందాడు. గంగమల్లు రెండురోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. బంధువులు జిల్లాకేంద్రంలోని ఓప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న క్రమంలో గుండెపోటు రావడంతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.