
ఆదర్శ మండల సమాఖ్యకు అవార్డు ప్రదానం
ఇల్లంతకుంట: ఇల్లంతకుంట ఆదర్శ మండల సమాఖ్య అధ్యక్షురాలు కట్ట సౌమ్య, మాజీ అధ్యక్షురాలు బొడిగ వనజలు గురువారం రాత్రి ఢిల్లీలోని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రులతో అవార్డు స్వీకరించారు. ఢిల్లీలోని భారతరత్న సుబ్రహ్మణ్యం ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహన్, చంద్రశేఖర్, కమలేష్ పాస్వాన్, ఆధ్వర్యంలో అవార్డు అందజేశారు. ఆదర్శ మండల సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ నిర్భర్ సంగతన్ అవార్డుకు జాతీయస్థాయిలో ఎంపికై ంది. అవార్డు స్వీకరించేందుకు మండలి సమాఖ్య అధ్యక్షులు రెండు రోజుల క్రితం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. వారితో పాటు డీఆర్డీవో శేషాద్రి కూడా వెళ్లారు. రుణాలు అందించడంలో, సకాలంలో రుణాలు రికవరీ చేయడంలో మీటింగులు సక్రమంగా నిర్వహించడంలో ఆదర్శ మండలి సమాఖ్య ఆదర్శంగా నిలిచింది. అవార్డు స్వీకరించడం పట్ల మండలి సమాఖ్య సభ్యులు ఇల్లంతకుంట మండల ప్రజలు ఆనందం వ్యక్తపర్చారు.