
యూరియా కొరత అబద్ధం
సిరిసిల్లటౌన్: జిల్లాలో లేని యూరియా కొరతను కొంతమంది అదేపనిగా అసత్య ప్రచారం చేస్తున్నారని సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే.మహేందర్‌రెడ్డి అన్నారు. గురువారం సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రా ష్ట్రానికి సరిపడా యూరియా నిల్వలున్నాయని రైతు లు ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. జిల్లాకు ఈనెలాఖరు వరకు 22వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా.. ఇప్పటికే 13,500 మెట్రిక్ టన్నుల యూరియాను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చై ర్మన్ సత్యనారాయణగౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షు డు చొప్పదండి ప్రకాశ్, నాయకులు పాల్గొన్నారు.