
పెరిగిన గోదావరి ప్రవాహం
● భక్తులను కాపాడిన పోలీసులు
ధర్మపురి: కడెం ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయడంతో ధర్మపురి వద్ద నీటి ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. అప్పటికే స్నానాలు చేసేందుకు గోదావరిలోకి దిగిన భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడే ఉన్న పోలీసులు నీటి ప్రవాహం నుంచి భక్తులను ఒడ్డుకు చేర్చారు. ఎస్సై ఉదయ్‌కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు భక్తులను బయటకు రప్పించేందుకు కృషి చేశారు. చూస్తుండగానే గోదావరి ఉధృతి పెరగడం.. ఐదుగురు చిన్నారులు, ఏడుగురు పెద్దలు నదిలోనే ఉండిపోవడం.. పోలీసులు సకాలంలో చేరుకుని వారిని బయటకు తీసుకురావడం క్షణాల్లో జరిగిపోయాయి. దీంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.

పెరిగిన గోదావరి ప్రవాహం