
పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగే 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొననున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. కలెక్టరేట్ సముదాయంలో పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి జెండా వందనం చేస్తారు. పంద్రాగస్ట్ వేడుకలకు జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎగువ మానేరుకు ఇన్‌ఫ్లో
గంభీరావుపేట(సిరిసిల్ల): మండలంలోని నర్మాల ఎగువమానేరు ప్రాజెక్టులో క్రమంగా నీటి మట్టం పెరుగుతోంది. పరవళ్లు తొక్కడానికి మరో ఆరు అడుగుల నీరు చేరాల్సి ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 2 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 1.27టీఎంసీల నీరుంది. 116 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది.
మిడ్‌మానేరుకు ఎల్లంపల్లి జలాలు
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టులోకి వరదకాలువ ద్వారా ఎల్లంపల్లి జలా లు చేరుతున్నాయి. రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్‌హౌస్ నుంచి ఎత్తిపోతల ద్వారా సుమారు 9,450 క్యూసెక్కుల నీరు మిడ్‌మానేరుకు తరలిస్తున్నారు. అలాగే మూలవాగు, మానేరు వాగుల్లోంచి ప్రాజెక్టులోకి 944 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టులో 7.60 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
పాత ఇళ్లలో నిద్రించవద్దు
సిరిసిల్ల: భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనల నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా బుధవారం కోరారు. వర్షాల నేపథ్యంలో పాత ఇళ్లలో నివాసం ఉండవద్దన్నారు. జిల్లాలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాణనష్టం లేకుండా చూడాలన్నారు. అత్యవసర సేవలకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 233 1495, వాట్సాప్ సెల్ నంబర్ 93986 84240 సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దన్నారు.
జిల్లాలో నమోదైన వర్షపాతం
జిల్లా వ్యాప్తంగా బుధవారం వర్షం కురిసింది. అత్యధికంగా ఇల్లంతకుంటలో 60.6 మి.మీ వర్షం పడగా.. రుద్రంగి 27.2, చందుర్తి 24.8, వేములవాడరూరల్ 34.4, బోయినపల్లి 38.1, వేములవాడ 46.1, సిరిసిల్ల 24.3, కోనరావుపేట 23.4, వీర్నపల్లి 18.4, ఎల్లారెడ్డిపేట 19.7, గంభీరావుపేట 13.5, ముస్తాబాద్ 36.6, తంగళ్లపల్లిలో 36.7 మి.మీ వర్షం కురిసింది. 13 మండలాల్లో సగటు వర్షపాతం 31.0 మి.మీటర్లుగా నమోదైంది.
యూరియా కోసం బారులు
సిరిసిల్లఅర్బన్: సిరిసిల్ల మున్సిపల్ పరిధి పెద్దూరు సింగిల్‌విండో కేంద్రం వద్ద రైతులు యూరియ కోసం బారులు తీరారు. రైతులకు సరిపడా యూరియ అందుబాటులో ఉందని సీఈవో గౌరీశంకర్ తెలిపారు.
ఎల్లారెడ్డిపేటలో ఉద్రిక్తత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలోని గ్రోమోర్ కేంద్రం వద్ద బుధవారం యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఉదయం 4.30 గంటలకే కేంద్రం వద్దకు చేరుకొని క్యూలైన్‌లో నిల్చున్నారు. 220 యూరియా బస్తాలు మాత్రమే వచ్చాయని తెలియడంతో అన్నదాతలు అసహనానికి గురయ్యారు. అలాగే ఐకేపీ గోదాంకు 440 బ్యాగులు మాత్రమే రాగా 500 వరకు రైతులు చేరుకున్నారు. యూరియా అందరికీ సరిపోయేలా లేకపోవడంతో రైతులు ఎగబడ్డారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు సర్దిచెప్పడంతో రైతులు శాంతించారు.

పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది

పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది

పంద్రాగస్ట్ వేడుకలకు ముఖ్య అతిథిగా విప్ ఆది