
రోగాల కూడు
● నిల్వ మాంసం.. కుళ్లిన కూరగాయలు ● నాసిరకం నూనెలు.. స్టోర్డ్ ఫుడ్ వినియోగం ● రంగులు, రసాయనాలతో ఆరోగ్యం చిత్తు ● ఫుడ్‌సేఫ్టీ ఉన్నతాధికారుల తనిఖీల్లో బహిర్గతం ● హోటళ్ల నిర్వాకం నియంత్రించలేని స్థానిక అధికారులు
‘పద్మనగర్‌కు చెందిన ఓ పదిహేనేళ్ల విద్యార్థిని వారంలో రెండ్రోజులు చాట్, పానీపూరీలు తినేది. రెండునెలల క్రితం హఠాత్తుగా ఆకలి మందగించి ఆహారం తీసుకోవడం మానేసింది. శరీరంలో నిస్సత్తువ పెరగడంతో తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులకు అనుమానం వచ్చి హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేయగా, అక్కడి వైద్యులు పరీక్షలు చేయడంతో హెపటైటీస్–ఏ నిర్ధారణ అయ్యింది. కారణాలు వెతికితే శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడమేనని తేలింది’.
ఇటీవల తనిఖీల్లో దొరికిన కుళ్లిన మాంసం నిల్వలు, ఇతర ఆహారపదార్థాలు
హానికర రసాయనాలు
జిల్లాలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాసిరకం ఆహారపదార్థాలు వాడుతున్నారు. రుచికోసం ఆహారంలో నిషేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నారు. గతంలో పలు హోటళ్లలో అధికారుల తనిఖీల్లో కలుషితనీరు, పాడైన ఆహార పదార్థాలు దొరికాయి. అప్పుడు నామమాత్రపు చర్యలు తీసుకోవడంతో నిర్వాహకులకు భయం లేకుండా పోయింది. స్థానిక అధికారులు శ్రీమామూళ్లుశ్రీగా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
సిరిసిల్లటౌన్: జిల్లాలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఆహార ఉత్పత్తుల్లో నాణ్యత లేమి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీధిసైడ్ బండిపై దొరికే ఆహారం నుంచి త్రీస్టార్ హంగులతో ఉండే హోటళ్లలో ఆహార భద్రత, నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. కుళ్లిన మాంసం, అపరిశుభ్ర పదార్థాలతో చేస్తున్న వంటలు పిల్లలు, పెద్దలు అన్నివర్గాల వారికి ప్రాణ సంకటంగా మారుతున్నాయి. నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు.

రోగాల కూడు