
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
గంభీరావుపేట(సిరిసిల్ల): మహిళలు ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీమణికంఠ గ్రామైక్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎరువులు, విత్తనాల దుకాణాన్ని బుధవారం ప్రారంభించారు. దాదాపు 2 గంటలు అక్కడే ఉండి ఎరువుల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షించారు. ఇందిరా మహిళా శక్తి పథకం కింద ఎరువులు, ఫర్టిలైజర్ దుకాణాలు పొందిన మహిళలు వ్యాపారాల్లో రాణించాలన్నారు. త్వరలో మహిళా సంఘాల సభ్యులకు రైసుమిల్లులు, సోలార్ ప్లాంట్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన దుకాణాల్లో రైతులు ఎరువులు, పురుగుమందులు కొని వారి ఆర్థికాభివృద్ధికి మద్దతునివ్వాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, అనవసర ప్రచారాన్ని రైతులు నమ్మవద్దన్నారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చైర్‌పర్సన్ కొమిరిశెట్టి విజయ, ఏవో సలావుద్దీన్, ఏఈవో ప్రవీణ్, వైస్ చైర్మన్ అంజిరెడ్డి, తహసీల్దార్ మారుతిరెడ్డి, ఐకేపీ ఏపీఎం దేవయ్య పాల్గొన్నారు.
భూపత్రాలు అందజేత
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ గ్రామంలో 3.28 ఎకరాల ప్రభుత్వ భూమి పత్రాలను రెవెన్యూ అధికారులు బుధవారం జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రకాశ్‌కు అందజేశారు. గ్రామంలో వరిధాన్యం కొనుగోలుకు సదరు భూమిని ఉపయోగించనున్నట్టు మార్కెటింగ్ అధికారి తెలిపారు. సదరు స్థలంలో గ్రామస్తులు ఎలాంటి పనులు చేయకూడదని సూచించారు. ఆర్‌ఐ సంతోష్ కుమార్, ఏఎంసీ కార్యదర్శి హరినాథ్, గ్రామస్తులు పాల్గొన్నారు

మహిళలు ఆర్థికంగా ఎదగాలి