
దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యం
సిరిసిల్లటౌన్: దేశ సమగ్రతే బీజేపీ లక్ష్యమని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్‌లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలో నేతన్న విగ్రహం నుంచి గాంధీ వరకు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. మన సైనికుల పరాక్రమంపై గర్వంతో జాతి సమైక్యతకు ప్రతీకగా అందరం మన ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురేద్దామని పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎర్ర మహేశ్, అల్లాడి రమేశ్, లింగంపల్లి శంకర్, మ్యాన రాంప్రసాద్, ఆడెపు రవీందర్, మల్లారెడ్డి, మార్త సత్తయ్య, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, నంద్యాడపు వెంకటేశ్, సిరికొండ శ్రీనివాస్, గూడూరి భాస్కర్, నవీన్‌యాదవ్, గజబింకర్ చందు, సురేందర్‌రావు, నాగుల శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్షురాలు అన్నపూర్ణ, సిరిసిల్ల, వేములవాడ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్, రాపల్లి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.