నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Aug 12 2025 11:13 AM | Updated on Aug 13 2025 7:22 AM

నైపుణ

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగు

కరీంనగర్‌రూరల్‌: బొమ్మకల్‌లోని ట్రినిటి ఇంజనీరింగ్‌ కళాశాలలో సోమవారం ఎడ్యూనెట్‌ ఫౌండేషన్‌ ద్వారా సాప్‌ కార్యక్రమాన్ని ఎడ్యునెట్‌ ప్రాజెక్టు మేనేజరు అఫ్సర్‌ పాషా, ప్రోగ్రాం మేనేజర్‌ దేవీసేన్‌ ప్రారంభించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ట్రినిటి విద్యాసంస్థల వ్యవస్థాపకులు దాసరి మనోహర్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎడ్యునెట్‌ ఫౌండేషన్‌ ద్వారా అందించే సాప్‌ కోర్స్‌ను ఎంబీఏ విద్యార్థులు సద్వి నియో గం చేసుకోవాలన్నారు. చైర్మన్‌ దాసరి ప్ర శాంత్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ నాగేంద్రసింగ్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ కిశోర్‌, ఏవో రాజశేఖర్‌రెడ్డి, హెచ్‌వోడీ ప్రవీణ్‌కుమార్‌, సంతోషి, రజితరెడ్డి, ఇలియాస్‌అలీ, అజారుద్దీన్‌, సుప్రియ పాల్గొన్నారు.

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ముస్తాబాద్‌(సిరిసిల్ల): ముస్తాబాద్‌ మండలం గూడెంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎస్సై గణేశ్‌ తెలిపిన వివరాలు. గూడెంకు చెందిన పిట్ల దేవయ్య(60) సోమవారం ఉదయం ఇంట్లో మృతిచెంది ఉన్నాడు. దేవయ్య ముఖం, శరీరంపై గాయాలు ఉన్నాయి. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ సోదరుడు లస్మయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు సీఐ మొగిలి, ఎస్సై గణేశ్‌ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని ఎస్సై తెలిపారు. దేవయ్య ఆయన కుమారుడు చందు తరచూ గొడవ పడేవారని, అర ఎకరం భూమి విషయంలో తండ్రీకొడుకుల మధ్య వివాదం తలెత్తిందని తెలిపారు. ఆ కోణంలో చందును ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు.

జ్వరంతో యువకుడు..

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్‌ శివ(23) జ్వరంతో బాధపడుతూ సోమవారం మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు. రాచర్లగుండారం గ్రామానికి చెందిన లకావత్‌ జయరాం–సోబి దంపతుల కుమారుడు శివ చిన్నతనం నుంచి మూర్ఛవ్యాధితో బాధపడుతుండే వాడు. గత నాలుగు రోజు లుగా జ్వరంతో బాధపడుతున్న శివకు ఆర్‌ఎంపీల వద్ద వైద్యం అందించారు. జ్వరం తగ్గకపోగా.. పరిస్థితి విషమించి మండల కేంద్రంలోని ప్రైవే ట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు.

డిష్‌ రిపేర్‌ చేస్తూ ఒకరు..

సారంగాపూర్‌: మండలంలోని పెంబట్ల గ్రామంలో ఓ ఇంటిపై డిష్‌ రిపేర్‌ చేస్తూ.. కిందపడి పల్లికొండ మహేశ్‌ (40) మృతిచెందిన సంఘటన చోటుచేసుకుంది. ఎస్సై గీత కథనం ప్రకారం.. జగిత్యాలలోని పోచమ్మవాడకు చెందిన మహేశ్‌ పెంబట్లలోని చొప్పరి రాజేందర్‌ ఇంట్లో డిష్‌ రాకపోవడంతో మహేశ్‌ వైర్‌ను సరిచేసేందుకు ఇంటిపైకి ఎక్కాడు. మహే్‌శ నిలబడి ఉన్న సజ్జ విరిగి కింద పడిపోయాడు. మహే్‌శ తల బండరాయిపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

మత్తుకు అలవాటై..

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి(సిరిసిల్ల): జల్సాలకు అలవాటుపడ్డ యువకులు క్రమంగా గంజాయి మత్తుకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం గంజాయి విక్రయిస్తుండగా పోలీసులకు చిక్కారు. ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపిన వివరాలు.. నిజామాబాద్‌ జిల్లా సిరికొండ మండలం పందిమడుగుకు చెందిన మలావత్‌ రామ్‌కుమార్‌, వీర్నపల్లి మండలం సీతారాంనాయక్‌ తండాకు చెందిన బానోత్‌ అజయ్‌కుమార్‌, అజ్మీరా సాయివిశాల్‌ జల్సాలకు అలవాటుపడ్డారు. ఈక్రమంలోనే గంజాయికి అలవాటుపడ్డారు. డబ్బు సంపాదించేందుకు గంజాయిని తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు విక్రయించాలనుకున్నారు. వీర్నపల్లి మండలం రంగంపేటలోని జంపన్న చెరువు వద్ద గంజాయి విక్రయించేందుకు రాగా పోలీసులు చాకచక్యంగా పట్టుకుని కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. వారి నుంచి 50 గ్రాముల గంజాయి, పల్సర్‌ బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకోవడం చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై లక్ష్మణ్‌, పోలీస్‌ సిబ్బందిని సీఐ అభినందించారు.

ద్విచక్ర వాహనం నుంచి పడిపోయిన బంగారం బ్యాగు

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం హన్మాజీపేట–పొరండ్ల శివారులో ద్విచక్రవాహనంపై వెళ్తున్న భార్యాభర్తల వద్దనున్న బంగారం బ్యాగు పడిపోయిన సంఘటన సోమవారం చోటుచేసుకుంది. రాయికల్‌ మండలం వీరాపూర్‌కు చెందిన స్వామిరెడ్డి తన భార్యతో కలిసి సోమవారం జగిత్యాల మార్కెట్‌లో కూరగాయలు కొనుక్కుని వెళ్తుండగా వారి వద్దనున్న బంగారం బ్యాగు హన్మాజీపేట–పొరండ్ల మధ్యలో పడిపోయింది. పొరండ్లకు వెళ్లేసరికి బంగారు బ్యాగుతోపాటు, సెల్‌ఫోన్‌ కన్పించకపోవడంతో రోడ్డు వెంట పరిశీలించుకుంటూ వచ్చినా బ్యాగు దొరకలేదు. బాధితులు రూరల్‌ పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో పరిశీలిస్తున్నారు.

నైపుణ్యాన్ని    పెంపొందించుకోవాలి
1
1/2

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

నైపుణ్యాన్ని    పెంపొందించుకోవాలి
2
2/2

నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement