
రేషన్‌కార్డు.. అన్నింటికీ ఆధారం
● అర్హులందరికీ అందజేస్తాం ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
ఎల్లారెడ్దిపేట(సిరిసిల్ల): రేషన్‌కార్డు పేదల ఆత్మగౌరవ ప్రతీక అని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. మండల కేంద్రంలోని మణికంఠ గార్డెన్స్‌లో ఆదివారం నూతన రేషన్‌కార్డులు పంపిణీ చేపట్టారు. కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్డిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్‌కార్డులు జారీ చేస్తున్నామని తెలిపారు. వీటి ద్వారా పేదలకు ప్రతీ నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1,494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2,999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసినట్లు వివరించారు. ప్రభుత్వ పథకాలు అన్నింటికీ రేషన్‌కార్డు కీలక డాక్యుమెంట్ అని పేర్కొన్నారు. నూతన రేషన్‌కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని స్పష్టం చేశారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్‌ర్సన్ సావేరా బేగం, డిప్యూటీ తహసీల్దార్ మురళీ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, నాయకులు మహేందర్, రామచంద్రం, చిన్ని బాబు, పందిర్ల లింగంగౌడ్, గిరిధర్‌రెడ్డి, గంట బుచ్చగౌడ్, రాములు పాల్గొన్నారు.