
ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవం
వేములవాడరూరల్: ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మ గౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లిలో ఇందిరమ్మ ఇల్లును ఆదివారం పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇప్పటికే బేస్‌మెంట్ పూర్తి చేసుకొని పనులు శరవేగంగా కొనసాగుతున్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలనే ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని నిర్ణయించిందని తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, నాయకులు అడ్డిక జైపాల్‌రెడ్డి, సోమినేని బాలు, కరుణాకర్, సందీప్, శ్రీనివాస్, వెంకటేష్, ప్రవీణ్ తదితరులు ఉన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్