
బీసీ రిజర్వేషన్ల చట్టం చేయాలి
● ముస్లింల పేరు చెప్పి బీజేపీ అడ్డుకోవద్దు ● సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో బీసీల విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లుకు కేంద్ర ప్రభుత్వం చట్టం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లపై బీజేపీ మోకాలు అడ్డుతోందని ఆరోపిస్తూ ఆదివారం సిరిసిల్ల లోని అంబేడ్కర్‌చౌరస్తాలో ధర్నా చేపట్టారు. 42 శాతం బిల్లులు ఆమోదించి కేంద్రం బీసీలపై చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ, జిల్లా నాయకులు మిట్టపల్లి రాజమౌళి, రాపల్లి రమేశ్, నక్క దేవదాస్, సిరిసిల్ల సత్యం, ఒగ్గు గణేశ్, ఉడుత రవి, దాసరి రూప, బెజిగం సురేష్, బండి శ్రీనివాస్, సందుపట్ల పోచమల్లు పాల్గొన్నారు.