
‘ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే’
ఇల్లంతకుంట(మానకొండూర్): రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీ వైపే ఉండాలని ప్రభుత్వానికి ప్రజల అండదండలు అవసరమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కోరారు. స్థానిక మండల పరిషత్‌లో శుక్రవారం 125 మంది లబ్ధిదారులకు సీఎమ్మార్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఎంపీడీవో శశికళ, డిప్యూటీ తహసీల్దార్ సత్యనారాయణ, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ ఎలగందుల ప్రసాద్, మహిళా కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షురాలు పుష్పలత తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
సిరిసిల్లటౌన్: ప్రజలు తమ ఇల్లు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ఖధీర్‌పాషా కోరారు. స్థానిక 17వ వార్డు గాంధీనగర్‌లో శుక్రవారం డ్రై డేలో పాల్గొని మాట్లాడారు. వర్షాకాలం దృష్ట్యా ఇంట్లో దోమల నివారణ తగు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీటి నిలువలు లేకుండా చూడాలని కోరారు. అధికారులు ఎడ్ల శేఖర్, మేఘన, మమత, ఏఎన్‌ఎం అన్నపూర్ణ, ఆశవర్కర్లు శ్రీవాణి, మమత, వార్డు జవాన్ దేవయ్య పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలి
● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపర్చిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని, అందుకోసం ఇప్పటి నుంచి ప్రణాళికలు రూపొందించాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య కోరారు. మండలంలోని అల్మాస్‌పూర్, దుమాల గ్రామాల్లో శుక్రవారం పార్టీ ముఖ్యనాయకులతో సమావేశమయ్యారు. మండలంలో అత్యధిక స్థానాలు గెలుపొంది కేటీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. ప్రభుత్వం నెరవేర్చని హామీలను ప్రజల్లో ప్రచారం చేయాలని సూచించారు. పార్టీ మండల అధ్యక్షుడు వరుస కృష్ణహరి, సింగిల్‌విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ చీటి లక్ష్మ ణ్‌రావు, మాజీ ఏఎంసీ చైర్మన్ గుల్లపల్లి నర్సింహరెడ్డి, నాయకులు నర్సాగౌడ్, నమిలికొండ శ్రీనివాస్, శరవింద్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి చొరవ చూపండి
బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని మండలంలోని నీలోజిపల్లికి చెందిన పలువురు నిర్వాసితులు శుక్రవారం మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గత బీ ఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్వాసితుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కొండం శ్రీని వాసరెడ్డి, చెంచు నాగరాజు, ఆవుల లక్ష్మణ్, రాజేంద్రప్రసాద్, ఎర్ర శ్రీకాంత్, మోహన్ ఉన్నారు.
చిరుజల్లులు
సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా గురువారం సాయంత్రం నుంచి శుక్రవారం వరకు చిరుజల్లులు కురిశాయి. అత్యధికంగా వీర్నపల్లి మండలంలో 34.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. రుద్రంగిలో 24.4, చందుర్తిలో 3.4, వేములవాడ రూరల్‌లో 0.1, వేములవాడలో 0.4, సిరిసిల్లలో 12.5, కోనరావుపేటలో 4.7, ఎల్లారెడ్డిపేటలో 32.1, గంభీరావుపేటలో 18.0, ముస్తాబాద్‌లో 19.4, తంగళ్లపల్లిలో 31.0, ఇల్లంతకుంటలో 18.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోయినపల్లిలో పెద్దగా వర్షం పడలేదు.

‘ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే’

‘ప్రజల మద్దతు కాంగ్రెస్ వైపే’