
రావమ్మా మహాలక్ష్మీ
శనివారం శ్రీ 9 శ్రీ ఆగస్టు శ్రీ 2025
శ్రావణ శుక్రవారం జిల్లాలోని మహిళలు వరలక్ష్మీ వ్రతాలను భక్తిశ్రద్ధలతో నోముకున్నారు. వేములవాడలోని మహాలక్ష్మీ ఆలయంలో జరిగిన వ్రతాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. స్థానాచార్యులు ఉమేశ్‌శర్మ నేతృత్వంలో అర్చకుల బృందం రాజన్న గుడి నుంచి బైపాస్‌రోడ్డులోని మహాలక్ష్మీ ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకున్నారు. ఈవో రాధాభాయి, ఏఈవోలు అశోక్, శ్రవణ్, జయకుమారి, సెస్ డైరెక్టర్ నామాల ఉమ తదితరులు పాల్గొన్నారు. – వేములవాడ/ సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల
న్యూస్‌రీల్

రావమ్మా మహాలక్ష్మీ

రావమ్మా మహాలక్ష్మీ