
అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
సిరిసిల్ల: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సిరిసిల్ల అగ్నిమాపక అధికారి ఎన్.నరేందర్ సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రైవేటు ఆస్పత్రిలో అగ్నిప్రమాదాలు–నివారణ చర్యలపై శుక్రవారం అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఒక్క అగ్గి రవ్వ అపారమైన ఆస్థి, ప్రాణ నష్టానికి కారణమవుతుందన్నారు. ముందుజాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలు జరగవని స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే 101, 87126 99258 నంబర్‌లలో సమాచారం ఇవ్వాలని సూచించారు. ఆస్పత్రి డాక్టర్ వంశీగౌడ్, అగ్నిమాపక, ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్‌పై విచారణ
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని సిరికొండ ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్‌పై వచ్చిన ఆ రోపణలపై జిల్లా అధికారులు శుక్రవారం గ్రామంలో విచారణ చేపట్టారు. ఫీల్డ్ అసిస్టెంట్ తడిసిన సత్తయ్య ఐదెకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశాడని గత నెల 28న ప్రజావాణిలో గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. డీఆర్డీఏ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ నరసింహులు, ఇల్లంతకుంట ఎంపీడీవో శశికళ, ఆర్‌ఐ సంతోష్‌కుమార్ గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు.