
గురుకులం విద్యార్థులకు జ్వరాలు
● రక్తనమూనాల సేకరణ ● వైరల్ ఫీవర్స్ : ఎంఈవో
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల ఏకలవ్య గురుకులంలోని విద్యార్థులు జ్వరాల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు కలిసి గురువారం ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో విద్యార్థుల రక్త నమూనాలు సేకరించి ల్యాబ్‌కు తరలించారు. ఇద్దరు విద్యార్థులు వాంతులు, విరోచనాలతో బాధపడుతుండగా, వారికి పరీక్షలు చేసి వైద్యం అందించారు. మిగతా విద్యార్థుల రక్త నమూనాలను సేకరించి వారిని హాస్టల్‌కు తరలించారు. కొందరికి వైరల్ ఫీవర్స్ వచ్చాయని, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎంఈవో కృష్ణహరి తెలిపారు.