
వేడుకగా జాతీయ చేనేత దినోత్సవం
సిరిసిల్ల: జాతీయ చేనేత దినోత్సవాన్ని సిరిసిల్లలో గురువారం వేడుకగా నిర్వహించారు. స్థానిక పాతబస్టాండ్‌లోని నేతన్నచౌక్ వద్ద గల నేతన్న విగ్రహానికి కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కె.కె. మహేందర్‌రెడ్డి పూలమాలలు వేశారు. వస్త్రపరిశ్రమకు ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ఆర్డర్లు, యార్న్ బ్యాంకు ద్వారా నూలు, స్కూల్ యూనిఫాం, విద్యుత్ సబ్సిడీ అంశాలను గుర్తు చేశారు. చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, వస్త్రోత్పత్తిదారులు దూడం శంకర్, తాటిపాముల దామోదర్, వేముల దామోదర్, యెల్దండి శంకర్, గుండ్లపల్లి గౌతమ్, మండల బాలరాజు, బూర కనకరాజేశం, బూట్ల నవీన్, బీజేపీ నాయకులు ఆడెపు రవీందర్, నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో..
పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలోనూ జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. పద్మశాలి సంఘం నాయకులు మండల సత్యం, డాక్టర్ గాజుల బాలయ్య, మోర రవి, గోసిక అనిల్‌కుమార్, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో...
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలోనూ నేతన్న విగ్రహానికి, విద్యానగర్ చౌరస్తాలో కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహాలకు పూలమాలలు వేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, పార్టీ నాయకులు గూడూరి ప్రవీణ్, మంచె శ్రీనివాస్, ఆకునూరి శంకరయ్య, దార్నం అరుణ, అడ్డగట్ల మురళి, బత్తుల వనజ, మ్యాన రవి, సబ్బని హరీశ్, గెంట్యాల శ్రీనివాస్, దార్ల సందీప్, అన్నారం శ్రీనివాస్, కల్లూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
● నేతన్న విగ్రహానికి పూలమాలలు

వేడుకగా జాతీయ చేనేత దినోత్సవం