
పారిశుధ్య నిర్వహణపై శ్రద్ధ పెట్టాలి
సిరిసిల్ల/ముస్తాబాద్/తంగళ్లపల్లి(సిరిసిల్ల): పల్లెల్లో పారిశుధ్య నిర్వహణపై పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కలెక్టరేట్‌లో గురువారం సీజనల్ వ్యాధుల నియంత్రణపై ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, వైద్యాధికారులు, వైద్యసిబ్బందితో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ డెంగీ కేసులు నమోదైన ప్రాంతంలో ప్రత్యేకంగా పారిశుధ్య చర్యలు చేపట్టాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శి బాధ్యతగా పనిచేయాలన్నారు. మంగళ, శుక్రవారా లలో డ్రై డే చేపట్టాలని సూచించారు. డెంగీ కేసులను తక్కువ చేసి చూపించొద్దని, ఎన్ని కేసులు గుర్తించి, చికిత్స అందిస్తే అంత బాగా పని చేసినట్లుగా పరిగణిస్తామని స్పష్టం చేశారు.
ఆస్తి పన్ను వసూలు చేయాలి
ప్రతీ గ్రామంలో ఆస్తిపన్ను వసూలు లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో పని చేయాలన్నారు.
అన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాస్‌లు ప్రారంభం
సిరిసిల్లలోని ఎంజేపీటీబీసీ బాలికల గురుకులం, ముస్తాబాద్ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల విద్యాలయం, తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లి సోషల్ వెల్ఫేర్, సారంపల్లి ట్రైబల్ వెల్ఫేర్, నేరెళ్ల తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాలల్లో అన్ అకాడమీ ఆన్‌లైన్ క్లాసులను కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే.మహేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ముస్తాబాద్ ఇందిరమ్మకాలనీలో అంగన్‌వాడీ కేంద్రం నూతన భవనాన్ని ప్రారంభించారు.
ఆన్‌లైన్‌లో సీనియర్ సిటిజన్
మెయింటనెన్స్ కేసులు
జిల్లాలో సీనియర్ సిటిజన్స్(వయోవృద్ధులు) మెయింటనెన్స్ కేసులు ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. కేసులు ఆఫ్‌లైన్‌లో కాకుండా, ఆన్‌లైన్ పోర్టల్ https://tgseniorcitizens.cgg.gov.inలో నమోదు చేయాలని తెలిపారు. మీసేవ కేంద్రాల్లో సీనియర్ సిటిజన్ కేసుల ఆన్‌లైన్ ఫైలింగ్ చేపట్టాలన్నారు. కేసు పురోగతి వివరాలు ఎప్పటికప్పుడు తె లుస్తాయని స్పష్టం చేశారు. డీఎంహెచ్‌వో రజిత, డీ పీవో షరీఫొద్దీన్, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం ఉన్నారు.