
నడుమునొప్పి పక్కా..
ఇది వేములవాడలోని సుభాష్‌నగర్ రోడ్డు. ఈ రోడ్డు గుండా భక్తులు, స్థానికులు తిరుగుతూనే ఉంటారు. రద్దీగా ఉండే ఈ రోడ్డులో యాభైకి పైగా గుంతలు ఏర్పడి వాహనదారులు వెళ్లలేకుండా మారింది. ఇంతటి రద్దీగా ఉండే రోడ్డును అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. ఈ రోడ్డుపై బీటీరోడ్డు వేసి రాకపోకలకు అంతరాయం లేకుండా చూడాలని జనం కోరుకుంటున్నారు.
ఇది సెస్ ఆఫీస్ ఎదుట ఉన్న ప్రధాన రహదారి. ఈ రోడ్డుపై ఏర్పడిన ఓ గొయ్యిని మున్సిపల్ అధికారులు పూడ్చారు. కానీ ఇక్కడ వర్షం కురిసినప్పుడల్లా గుంతలుగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.
వేములవాడ: ఆధ్యాత్మిక పట్టణంలోని రహదారులపై అడుగుకో గుంత పడింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ప్రమాదం జరుగుడు ఖాయం. కండ్లు మూసి తెరిచేలోపే ద్విచక్రవాహనాలు గుంతల్లో పడిపోతున్నాయి. చాలా మంది పట్టణ ప్రజలు ఈ రోడ్లపై ప్రయాణిస్తూ నడుము నొప్పులతో బాధపడుతున్నారు.
రద్దీ పట్టణం.. రోడ్లు అధ్వానం
వేములవాడ పట్టణంలో ప్రసిద్ధ శ్రీరాజరాజేశ్వరస్వామి కొలువుదీరడంతో రాష్ట్రంతోపాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తుంటా రు. ఇలా నిత్యం 30 వేల వరకు భక్తులు వేములవాడకు వచ్చి పోతుంటారు. వీరితో పాటు స్థానికులు ఇవే రోడ్లపై తిరుగుతుంటారు. ఇంతటి రద్దీ ఉండే పట్టణంలో రోడ్లు చూస్తే దారుణంగా ఉన్నాయి. తిప్పాపూర్ వంతెన నుంచి రాజన్న ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపడుతుండడంతో శిథిలాలతో నడవలేకుండా మారింది. మిగతా రోడ్లు గుంతలుపడ్డాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి వేములవాడ పట్టణంలోకి వచ్చే ప్రధాన రహదారులతోపాటు అంతర్గత రోడ్లను బాగు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
వేములవాడలో అధ్వానంగా రోడ్లు
అడుగుకో గుంతతో అవస్థలు
మరమ్మతు చేయని అధికారులు
ఇది వేములవాడ పట్టణంలోని పాపన్నచౌక్. ఉదయం 3 నుంచి 8 గంటల వరకు కూరగాయల మార్కెట్ నిర్వహిస్తారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటలకు అనేక పల్లెలకు చెందిన వేలాది మంది జనం వస్తుంటారు. ఈ గుంతల రోడ్డుతో ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టాలని జనం కోరుతున్నారు.
రోడ్లు బాగుచేస్తాం
వేములవాడలోని రోడ్లను బాగుచేస్తాం. ఇందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాం. త్వరలోనే పనులు చేపట్టి ప్రజలకు సౌకర్యవంతంగా మార్చుతాం. తెలంగాణచౌక్ నుంచి పాపన్నచౌక్ వరకు బీటీ రోడ్డు వేస్తున్నాం. మూలవాగు నుంచి రాజన్న ఆలయం వరకు ఆర్‌అండ్‌బీ అధికారులు 80 ఫీట్లతో రోడ్డు పనులు చేపట్టబోతున్నారు. సుభాష్‌నగర్ రోడ్డును బాగు చేయిస్తాం.
– అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ

నడుమునొప్పి పక్కా..

నడుమునొప్పి పక్కా..

నడుమునొప్పి పక్కా..