
మహిళలకు బస్సు డ్రైవింగ్‌లో శిక్షణ
● నేడు జెడ్పీ ఆఫీస్‌లో ఇంటర్వ్యూలు
సిరిసిల్ల: జిల్లాలోని ఆసక్తి గల మహిళలకు ఉచితంగా బస్సు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు డీఆర్‌డీఏ అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. బస్సు డ్రైవింగ్ శిక్షణను సెర్ప్, ఎంవోడబ్ల్యూవో ఆధ్వర్యంలో మూడు నెలలు ఇవ్వనున్నారు. 21–40 ఏళ్ల మధ్య వయసు, పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని పేర్కొన్నారు. 160 సెంటిమీటర్ల ఎత్తు, ఆరోగ్యంగా ఉండాలని తెలిపారు. ఆసక్తి గల మహిళలు జిల్లా సమాఖ్యలో గురువారం ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని అధికారులు కోరారు. జెడ్పీ ఆఫీస్‌లోని మహిళా సమాఖ్య భవనంలో ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు.