
యజమానుల దోపిడీపై పోరాడుతాం
● బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సూరం పద్మ
సిరిసిల్లటౌన్: బీడీ కంపెనీ యాజమాన్యాలు శ్రామి క దోపిడీపై పోరాటం చేస్తామని బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సూరం పద్మ పేర్కొన్నారు. సిరిసిల్లలోని అమృత్‌లాల్ శుక్లా కార్మి క భవనంలో బుధవారం అధ్యక్షురాలు దాసరి రూప అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం జరిగింది. పద్మ మాట్లాడుతూ బీడీ కంపెనీ యాజమాన్యం కార్మికుల నుంచి నెలకు రెండు వెయ్యిల బీడీల కూలీని దోచుకుంటున్నాయని ఆరోపించారు. రేయింబవళ్లు పనిచేసిన కార్మికులకు నెలకు రూ. 3వేల వరకు కూలీ వస్తే అందులో నుంచి రూ. వెయ్యి వరకు యజమానులే దోచుకుంటున్నారన్నా రు. నగదు బీడీ కంపెనీలు పుట్టగొడుగుల పుట్టుకొ స్తున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకో వడం లేదన్నారు. యూనియన్ నాయకులు జిందం కమలాకర్, బెజ్గం సురేష్, బోనాల లక్ష్మి పాల్గొన్నారు.