
కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం
జగిత్యాలక్రైం: జగిత్యాల కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం కనిపించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. వేములవాడ బస్ ప్లాట్‌ఫాం సమీపంలోని మరుగుదొడ్ల పక్కన వ్యక్తి మృతదేహం ఉందని, బూడిద రంగు టీషర్ట్, తెల్లపంచ కట్టుకుని ఉన్నాడని, మృతదేహాన్ని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో భద్రపర్చామని పేర్కొన్నారు. అతని సమాచారం తెలిసినవారు 87126 56815నంబర్‌లో సంప్రదించాలని కోరారు.
ఉరేసుకుని వివాహిత ఆత్మహత్య
శంకరపట్నం: మండలంలోని తాడికల్ గ్రామంలో వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శంకరపట్నం ఎస్సై శేఖర్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శ్రావ్య(27)కు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లికి చెందిన అమ్మిగల్ల ధర్మతేజ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు శ్రేయాన్స్‌నందన్ ఉన్నాడు. ధర్మతేజ్ రెండేళ్లక్రితం దుబాయ్ వెళ్లాడు. అప్పటినుంచి శ్రావ్య పుట్టింట్లో ఉంటోంది. సోమవారం రాత్రి దుబాయ్ నుంచి ధర్మతేజ్ శ్రావ్యతో వీడియోకాల్‌లో మాట్లాడాడు. ఇద్దరిమధ్య గొడవ జరగడంతో మంగళవారం వేకువజామున ఇంట్లో శ్రావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రావ్య సోదరుడు గొట్టె శివకృష్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.
మానసికవేదనతో ఒకరు..
చిగురుమామిడి: చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన బల్ల బాలయ్య(50) మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. బాలయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. గుండె సంబంధిత ఆపరేషన్ సైతం జరిగింది. కొద్దిరోజులుగా మానసిక వేదనకు గురవుతూ.. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
‘కాళేశ్వరం’పై బూటకపు నివేదిక
● కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు
గంభీరావుపేట(సిరిసిల్ల): కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోతలను నిలిపివేసి ఆ ప్రాజెక్టుపై బూటకపు నివేదికలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని కేడీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్‌ను గంభీరావుపేట బీఆర్‌ఎస్ కార్యాలయంలో మంగళవారం ఎల్‌ఈడీలో వీక్షించారు. అనంతరం మండలస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక గత 20 నెలలుగా ప్రజలు సాగు, తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉందన్నారు. ప్రపంచంలోనే అద్భుత కట్టడంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులకు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. పార్టీ మండలాధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, సెస్ డైరెక్టర్ నారాయణరావు, దయాకర్‌రావు తదితరులు పాల్గొన్నారు.

కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం

కొత్తబస్టాండ్‌లో గుర్తుతెలియని మృతదేహం