
మృతుడి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలి
మానకొండూర్: ఇసుక లారీ ఢీకొని చనిపోయిన మానకొండూర్ మండలం మద్దికుంట గ్రామానికి చెందిన కెక్కర్ల సురేశ్ కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైన ఊటూరు ఇసుకక్వారీ యజమానులు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణపై కేసు నమోదు చేయాలని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ డిమాండ్ చేశారు. మానకొండూర్‌లో మంగళవారం మాట్లాడుతూ.. కెక్కర్ల సురేశ్ కరీంనగర్‌లోని ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తూ కుటుంబానికి పెద్దదిక్కుగా ఉండేవాడన్నాడు. పోచంపల్లి వద్ద ఇసుక లారీని ఢీకొని చనిపోయాడాని తెలిపారు. సురేశ్‌ను అంబులెన్సులో కరీంనగర్ తీసుకెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. రహదారి వెంట ఇసుక లారీలు నిలిపేందుకు ఎవరు అనుమతి ఇచ్చారని మండిపడ్డారు. మృతుడి కుటుంబాన్ని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కనీసం పరామర్శించలేదన్నారు. మాజీ జెడ్పీటీసీ తాళ్లపల్లి శేఖర్‌గౌడ్, రవీందర్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, శాతరాజు యాదగిరి, పిట్టల మధు, నెల్లి శంకర్, గుర్రం కిరణ్ గౌడ్, గడ్డం సంపత్, నెల్లి మురళి, అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.
క్వారీ యజమాని, ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలి
మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్