విద్య జీవితాన్ని మారుస్తుంది | - | Sakshi
Sakshi News home page

విద్య జీవితాన్ని మారుస్తుంది

Aug 6 2025 7:45 AM | Updated on Aug 6 2025 7:45 AM

విద్య

విద్య జీవితాన్ని మారుస్తుంది

ఇల్లంతకుంట(మానకొండూర్‌): విద్య జీవితాన్ని మారుస్తుందని, వనరులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని ఇంటర్మీడియెట్‌ విద్యామండలి ప్రత్యేకాధికారి రమణారావు పేర్కొన్నారు. ఇల్లంతకుంటలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని సూచించారు. జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి శ్రీనివాస్‌, ప్రిన్సిపాల్‌ దేవరాజం ఉన్నారు.

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): వర్షాకాలంలో సీజ నల్‌ వ్యాధులపై వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి రజిత సూచించారు. మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఆరోగ్యకేంద్రంలోని రికార్డులు పరిశీలించారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలపై వంద శాతం లక్ష్యాలు సాధించాలన్నారు. గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మండల వైద్యాధికారి సారియా అంజుమ్‌ పాల్గొన్నారు.

మండల పరిషత్‌లో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండల ప్రజాపరిషత్‌ లో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ ప్రారంభమైంది. తంగళ్లపల్లి మండల పరిషత్‌లోని ఉద్యోగులు మంగళవారం ఫేస్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా అటెండెన్స్‌ వేశారు. ఎంపీడీవో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ను అమలు చేస్తున్నట్లు తెలిపారు.

దివ్యాంగులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

భవిత సెంటర్‌ నిర్వాహకురాలు జయలక్ష్మి

వేములవాడరూరల్‌: దివ్యాగులపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలని భవిత సెంటర్‌ నిర్వాహకురాలు కత్తి జయలక్ష్మి సూచించారు. వేములవాడ మండల పరిషత్‌లోని భవిత సెంటర్‌లో మంగళవారం దివ్యాంగుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. జయలక్ష్మి మాట్లాడుతూ భవిత సెంటర్‌లో పిల్లలకు ప్రత్యేకంగా అవగాహన, శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు కూడా ప్రత్యేక దృష్టి పెడితే వారికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంగవైకల్యం ఉన్న పలువురికి భవిత సెంటర్‌లో ఫిజియోథెరపీ చేయిస్తున్నట్లు తెలిపారు. డాక్టర్‌ మయూరి, గర్‌ల్స్‌ హైస్కూల్‌ కాంప్లెక్స్‌ హెచ్‌ఎం బన్నాజీ తదితరులు పాల్గొన్నారు.

గెస్ట్‌ టీచర్‌

పోస్టులకు ఇంటర్వ్యూలు

సిరిసిల్లటౌన్‌: జిల్లాలోని మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో ఆంగ్ల మాధ్యమ అతిథి ఉపాధ్యాయులు, అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్‌సీవో అంజలి తెలిపారు. ఈనెల 11న ఇంటర్వ్యూ, డెమో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. జేఎల్‌ జువాలజి(మహిళ), జేఎల్‌ కెమిస్ట్రీ(మహిళ), జేఎల్‌ ఇంగ్లిష్‌(జనరల్‌), పీజీటీ మ్యాథ్స్‌(జనరల్‌ మహిళ), పీజీటీ ఫిజికల్‌ సైన్స్‌(జనరల్‌, మహిళ), పీజీటీ ఇంగ్లిష్‌(మహిళ), టీజీటీ ఇంగ్లిష్‌(జనరల్‌) సబ్జెక్టుల్లో బోధించేందుకు దరఖాస్తులు కోరుతున్నామన్నారు. బీఎడ్‌, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈనెల 11న కరీంనగర్‌ జిల్లాలోని తిమ్మాపూర్‌ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని పాత రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ వెనకాల మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల పాఠశాలలో ఉదయం 10గంటలకు ఇంటర్వ్యూకు హాజరుకావాలని కోరారు.

విద్య జీవితాన్ని మారుస్తుంది 
1
1/2

విద్య జీవితాన్ని మారుస్తుంది

విద్య జీవితాన్ని మారుస్తుంది 
2
2/2

విద్య జీవితాన్ని మారుస్తుంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement