
ప్రభుత్వ వైద్యులుగా అన్నదమ్ములు
సిరిసిల్లటౌన్: పుట్టి పెరిగిన ఊరిలోనే ఇద్దరు అన్నదమ్ములు వైద్యులుగా కొలువుదీరారు. సిరిసిల్ల పట్టణం విమల్ థియేటర్ ప్రాంతానికి చెందిన గోల్డ్‌స్మిత్ పొలాస సురేష్‌కు ఇద్దరు కుమారులు ఆదిత్య, ఆకాశ్. జిల్లా ఆస్పత్రిలో ప్రభుత్వ వైద్యులుగా మంగళవారం విధుల్లో చేరారు. ఇటీవల ప్రభుత్వం వైద్యుల నియామకాల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండీ రేడియాలజీ చదివిన ఆదిత్య, ఎండీ జనరల్ మెడిసిన్ చదివిన ఆకాశ్ ప్రభుత్వ వైద్యులుగా ఉద్యోగం సాధించారు. ఇద్దరికీ జిల్లా జనరల్ ఆస్పత్రిలో పోస్టింగ్ రావడంతో తమ పుట్టిన ఊరిలో వైద్యసేవలు అందించే అవకాశం రావడం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పకడ్బందీ విచారణతోనే నేరస్తులకు శిక్ష
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
వేములవాడ: పకడ్బందీ విచారణతోనే నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుందని ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి పేర్కొన్నారు. పెండింగ్ కేసులు, ప్రస్తుత కేసుల పురోగతి, సబ్‌డివిజన్ పరిధిలో నేరాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం దిశ నిర్దేశం చేశారు. పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు కృషి చేయాలన్నారు. తరచూ నేరాలకు పాల్పడే వరిపై రౌడీషీట్స్ తెరవాలన్నారు. గంజాయి రవాణా, వినయోగాన్ని అడ్డుకోవాలన్నారు. సీఐలు వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, ఎస్సైలు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైద్యులుగా అన్నదమ్ములు