
ఎస్టీడీ బూత్‌బాయ్ ప్రస్థానం ఆదర్శం
● ‘ఎల్లలు దాటిన పోతుగల్ స్వీట్లు’పై కేటీఆర్ ఎక్స్‌లో పోస్టు
ముస్తాబాద్(సిరిసిల్ల): సాధించాలనే పట్టుదల.. చేసే పనిపై ప్రేమ ఉంటే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చని ఎస్టీడీ బూత్ బాయ్ నుంచి పలు రెస్టారెంట్లకు యజమాని అయిన బాలకృష్ణ ప్రస్థానం ఎందరికో ఆదర్శనీయమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు ‘ఎక్స్’లో మంగళవారం పోస్టు చేశారు. ‘సాక్షి’లో ‘ఎల్లలు దాటిన పోతుగల్ స్వీట్లు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి కేటీఆర్ స్పందించారు. స్వీటెస్టు న్యూస్ ఈరోజు ఉదయమే చూశానని, ఆ కథనం చదవుతుంటే బాలకృష్ణ సాధించి న విజయంపై గర్వంగా అనిపించిందని పేర్కొన్నారు. ఎస్టీడీలో బూత్‌బాయ్‌గా పనిచేసి పోతుగల్.. సిరిసిల్ల నుంచి దుబా య్ వరకు ఎదిగి ఎన్నో రెస్టారెంట్లు స్థాపించి 600 మందికి ఉపాధి కల్పిస్తున్న పోతుగల్ బిడ్డ బాలకృష్ణ సక్సెస్ స్టోరీ అద్భుతమని కొనియాడారు. నిజా యితీతో చేసే ఏ పనైన విజయం వైపు తీసుకెళ్తుందన్నారు. బాలకష్ణ కథనం యువతకు స్ఫూర్తిదాయకమన్నారు.