బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే | - | Sakshi
Sakshi News home page

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

Aug 5 2025 8:47 AM | Updated on Aug 5 2025 8:47 AM

బాధిత

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

● ఎస్పీ మహేశ్‌ బి గీతే

సిరిసిల్ల క్రైం: సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. బాధితులకు భరోసాగా ఉండేందుకు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతీ సోమవారం గ్రీవెన్స్‌ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మ హేశ్‌ బి గీతే పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 28 ఫిర్యాదులు సోమవారం స్వీకరించినట్లు వివరించారు.

డీటీవో ఆఫీస్‌ ఎదుట నిరసన

సిరిసిల్లటౌన్‌: చర్యలు తీసుకోవడంలో జిల్లా రవాణాశాఖ అధికారి జాప్యం చేస్తున్నారంటూ పౌర సంక్షేమ సమితి ప్రతినిధులు సోమవారం డీటీవో ఆఫీస్‌ ఎదుట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ సిరిసిల్ల సెస్‌ చైర్మన్‌ తన ప్రైవేటు వాహనంపై ప్రభుత్వ వాహనంగా బోర్డు పెట్టుకోవడంపై గత జూన్‌లో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. అధికారులు సెస్‌చైర్మన్‌కు నోటీస్‌ ఇచ్చినా బోర్డు తీయకుండా వాహనాన్ని వాడుకుంటున్నట్లు వెల్లడించారు. డీటీవో నోటీస్‌తో సరిపెట్టకుండా వెంటనే స్పందించి చట్టరీత్య చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమితి అధ్యక్షుడు బియ్యంకార్‌ శ్రీనివాస్‌, ప్రతినిధులు కుసుమ గణేష్‌, వేముల వెంకటేశం, సిద్దిరాల సారయ్య పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నిలకు సిద్ధంగా ఉండాలి

బోయినపల్లి/వేములవాడరూరల్‌: రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పోలీస్‌ అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి సూచించారు. బోయినపల్లి, వేములవాడరూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లను సోమవారం తనిఖీ చేశారు. స్టేషన్‌ నిర్వహణ, పోలీసుల పనితీరు, వారికి కేటాయించిన కిట్‌ ఆర్టికల్స్‌, జనరల్‌ డైరీ, స్టేషన్‌ రికార్డులు పరిశీలించారు. వాహనాల తనిఖీలు, డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్సై రాజకుమార్‌, ఏఎస్సైలు రాజయ్య, మల్లేశం సిబ్బంది ఉన్నారు.

బాధిత వృద్ధుడిని పరిశీలించిన వైద్యాధికారులు

రుద్రంగి(వేములవాడ): పీఎంపీ ఇంజక్షన్‌ వేయడంతో చేతికి సెప్టిక్‌ అయిన వృద్ధుడిని ప్రభు త్వ వైద్యాధికారులు సోమవారం పరిశీలించారు. ‘సాక్షి’లో ఆదివారం ప్రచురితమైన ‘పీఎంపీ నిర్లక్ష్యం.. వృద్ధుడికి శాపం’ కథనానికి వైద్యాధికారులు స్పందించారు. రు ద్రంగిలోని రోమాల గంగారాం ఇంటికి వెళ్లిన గాయాన్ని పరిశీలించారు. సెప్టిక్‌కు గల కారణాలు, వృద్ధుడి వివరాలు తెలుసుకున్నారు.

రాష్ట్రపోటీల్లో ప్రతిభ

సిరిసిల్లటౌన్‌: బీవైనగర్‌ షాదీఖానాలో సమూరై గోజుర్యో కరాటే అకాడమీ ఆధ్వర్యంలో రెండో రాష్ట్ర స్థాయి కరాటే టోర్నీ రెండు రోజుల క్రితం జరిగాయి. సిరిసిల్ల ప్రభుత్వ హైస్కూల్‌ విద్యార్థులు కటాస్‌లో బంగారు, వెండి పతకాలు సాధించారు. వీరిలో వి.హరిణి, ఆర్‌.వర్షిత, ఇ.శ్రీచంద్ర బంగారు పతకాలు గెలుపొందగా వై.రీత్య, వై.శాన్వి వెండి పతకాలు సాధించారు. స్కూల్‌ హెచ్‌ఎం చకినాల శ్రీనివాస్‌ సోమవారం విద్యార్థుల అభినందన సభలో మాట్లాడుతూ విద్యార్థులు మ రిన్ని రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని మెరుగైన ప్రతిభ కనబరుస్తూ చదువులో కూడా ముందుండాలని కోరారు. విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇచ్చిన కరాటే మాస్టర్‌ నాగుల కనకయ్యను, ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు. పీడీ డేవిడ్‌ సన్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
1
1/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
2
2/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
3
3/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే
4
4/4

బాధితులకు భరోసాగా గ్రీవెన్స్‌ డే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement