
బీసీ బిల్లుకు మోకాలడ్డుతున్న బీజేపీ
● 42 శాతం రిజర్వేషన్లపై కేంద్రంతో కొట్లాడుతాం ● ధర్నాకు ఢిల్లీ వెళ్తున్నాం ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో కేంద్రంలో అధికార పార్టీ మోకాలడ్డుతోందని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. సిరిసిల్లలో సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్లో మాట్లాడారు. బీసీలకు విద్య, ఉపాధి రంగాల్లో 42శాతం రిజర్వేషన్ల అమలుకు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు మూడు రోజులపాటు ఢిల్లీలో నిరసన తెలపనున్నట్లు పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రంలో సై అంటూనే కేంద్రంలో నై అంటున్న బీజేపీ నాయకుల వైఖరిని తప్పుబట్టారు. బీసీల మద్దతుతో సాగుతున్న కాంగ్రెస్ పోరాటం ఫలిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. నాగుల సత్యనారాయణగౌడ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, బుర్ర నారాయణగౌడ్, ఆడెపు చంద్రకళ పాల్గొన్నారు.