
మార్కెట్‌యార్డు నిర్మించాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): మండల కేంద్రంలో సమీకృత మార్కెట్‌యార్డు నిర్మించాలని కోరుతూ బీజేపీ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. మార్కెట్‌యార్డు కోసం గతంలో కేంద్ర ప్రభుత్వం రూ.50లక్షలు మంజూరు చేసిందని, అప్పటి మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే కేటీఆర్ రూ.50లక్షలు మంజూరు చేసి ర్యాలీలు నిర్వహించి క్షీరాభిషేకాలు చేసి శిలాఫలకం ఏర్పాటు చేశారన్నారు. నెలలు గడుస్తున్నా పనులు ప్రారంభించలేదన్నారు. మండలాధ్యక్షుడు కోడె రమేశ్, జిల్లా అధికార ప్రతినిధులు దేవసాని కృష్ణ, ప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి విగ్నేష్‌గౌడ్ ఉన్నారు.