సొంతూరిపై మమకారంతో.. | - | Sakshi
Sakshi News home page

సొంతూరిపై మమకారంతో..

Aug 4 2025 5:08 AM | Updated on Aug 4 2025 5:08 AM

సొంతూ

సొంతూరిపై మమకారంతో..

రుద్రంగి(వేములవాడ): విద్య..ఉద్యోగం..ఉపాధి కోసం పట్నం బాట పట్టిన వారంతా.. పల్లెల్లో గూడు నిర్మించుకుంటున్నారు. పుట్టిన ఊరు.. సొంత మనుషుల మధ్య గడిపేందుకు ఆసక్తి చూపుతున్నారు. నెలలో ఒక్కసారైన సొంతూరికి వస్తూ అందరిని పలకరిస్తూ.. ఆనందంగా గడుపుతున్నారు. హైదరాబాద్‌, ముంబయి, విదేశాలల్లో స్థిరపడిన వారు రుద్రంగి మండలంలోని గిరిజనతండా గ్రామాల్లో అందమైన భవంతులు నిర్మించుకుంటున్నారు. ఉండేందుకు నివాసాలతోపాటు ఊరి అభివృద్ధికి తోడ్పాటుగా నిలుస్తున్నారు. పట్నంలో ఉద్యోగం చేస్తూ.. పల్లెలపై మమకారం చూపుతున్న వారిపై ప్రత్యేక కథనం.

సొంత మనుషుల మధ్య ఉండాలనే..

రుద్రంగి మండలం బడితండా గ్రామం తూక్యతండాకు చెందిన గుగులోతు రఘుపతి నాయక్‌ జాదవ్‌ వృత్తి రీత్య వైద్యుడు. హైదరాబాద్‌లో వైద్యసేవలు అందిస్తూ అక్కడే స్థిరపడ్డారు. సొంతూరిపై ప్రేమతో గ్రామాభివృద్ధికి ఆర్థికంగా తోడ్పాటుగా నిలుస్తున్నారు. వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరితోపాటు గ్రామం నుంచి ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు తమకు తోచిన విధంగా సహాయం చేస్తున్నారు.

సర్పంచ్‌ తండాగా పేరు మార్పు

● రుద్రంగి మండలం సర్పంచ్‌తండాకు చెందిన నరహరినాయక్‌ ప్రభుత్వ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందారు. గ్రామానికి సేవ చేయాలని ఉద్దేశం, చిన్ననాటి మిత్రులతో గడపాలనే లక్ష్యంతో సొంతూరిలో ఇల్లు నిర్మించుకున్నాడు. 1987 నుంచి 1993 వరకు ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేశారు. నరహరినాయక్‌ సర్పంచ్‌ కావడంతో వారి గ్రామానికి సర్పంచ్‌తండాగా పేరు పెట్టారు. పదవీకాలం ముగిసిన తర్వాత ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ విమరణ పొందిన తర్వాత సొంతూ రిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఊరి సేవలో..

● ఇటీవల గ్రామంలో జరిగిన సేవాలాల్‌ మహారాజ్‌ జయంతి వేడుకలకు వైద్యుడు గుగులోతు రఘుపతినాయక్‌జాదవ్‌ దాదాపు రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. మానాలలోని బడితండాలో యువకులకు ప్రోత్సాహం అందించేందుకు క్రీడాపోటీలు నిర్వహించారు. రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ప్లానింగ్‌ ఆఫీసర్‌ నరహరినాయక్‌ సైతం గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరి స్ఫూర్తితో గ్రామానికి చెందిన మరింత మంది సేవా కార్యక్రమాలకు ముందుకొస్తున్నారు.

పట్నంలో జాబు.. పల్లెల్లో గూడు పుట్టిన ఊరిపై ప్రేమతో పల్లెబాట

గ్రామాభివృద్ధికి సహకారం

ఇది బడితండా గ్రామపంచాయతీ పరిధిలో డాక్టర్‌ గుగులోతు రఘుపతినాయక్‌ జాదవ్‌ నిర్మించుకుంటున్న ఇల్లు. రఘుపతినాయక్‌జాదవ్‌ హైదరాబాద్‌లో వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్నారు. పుట్టిన ఊరితో అనుబంధాన్ని మరింత పదిలం చేసుకునేందుకు తన సొంత భూమిలో ఇల్లు నిర్మించుకుంటున్నారు. పండుగలు, వారాంతపు రోజుల్లో ఊరికి వచ్చి వెళ్తుంటారు.

ఈ ఇల్లు రుద్రంగి మండలంలోని సర్పంచ్‌తండాకు చెందిన రిటైర్డ్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్‌ నరహరి నాయక్‌ది. ఉద్యోగరీత్య వివిధ ప్రాంతాలకు వెళ్లిన నరహరి సొంత గ్రామంలో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఊరిలోనే వ్యవసాయం చేస్తూ గ్రామస్తులతో కలిసి వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

సొంతూరిపై మమకారంతో..1
1/3

సొంతూరిపై మమకారంతో..

సొంతూరిపై మమకారంతో..2
2/3

సొంతూరిపై మమకారంతో..

సొంతూరిపై మమకారంతో..3
3/3

సొంతూరిపై మమకారంతో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement