
పోస్టర్లు ఆవిష్కరణ
సిరిసిల్లటౌన్: ఆమెరికా నిర్బంధానికి వ్యతిరేకంగా పోరాడుతున్న సోషలిస్టు క్యూబా ప్రజలకు అండగా నిలుద్దామని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ క్యూబాకు అండగా సంఘీభావం తెలిపాలని కోరారు. గురజాల శ్రీధర్, అన్నల్‌దాస్ గణేశ్, గడ్డం రాజశేఖర్, బింగి సంపత్, పాల్గొన్నారు.
రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ
సిరిసిల్లఅర్బన్: కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో రేషన్‌కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని సిరిసిల్ల మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూపరెడ్డి పేర్కొన్నారు. పెద్దూరులో ఆదివారం ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ రేషన్‌కార్డు రాకపోతే సంబంధిత రేషన్‌డీలర్ల వద్ద పేర్లు నమోదు చేసి, మీసేవ కేంద్రం ద్వారా తిరిగి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. నాయకులు చెన్నమనేని కీర్తి కమలాకర్‌రావు, ర్యాకం రమేశ్, కమలాకర్‌రావు పాల్గొన్నారు.
పింఛన్ల పెంపుపై పోరాటం ఆగదు
బోయినపల్లి(చొప్పదండి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆసరా పింఛన్‌లు పెంచాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆవునూరి ప్రభాకర్ కోరారు. మండల కేంద్రంలో ఆదివారం వృద్ధులు, వితంతు, దివ్యాంగులు, ఒంటరి మహిళలతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన విధంగా వృద్ధులు, వితంతు, ఒంటరి మహిళ, చేనేత కార్మికులకు రూ.4వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు పింఛన్‌లు ఇవ్వడం లేదన్నారు. పింఛన్‌ల సాధనకు ఈనెల 13న మంద కృష్ణ మా దిగ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి చేపడుతున్నట్లు తెలిపారు. ఖానాపూర్ లక్ష్మణ్, ఎలగందుల భిక్షపతి, జిల్లా కో–కన్వీనర్ కత్తెరపాక ర వీందర్, అక్కనపల్లి పరశురాములు, కన్నం సాగర్, ఇల్లందుల రాజు, కొంకటి రమేశ్ పాల్గొన్నారు.
బీసీ నినాదం హోరెత్తిస్తాం
సిరిసిల్లటౌన్: బీసీ నినాదాన్ని దేశవ్యాప్తంగా హోరెత్తిస్తామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పర్శ హన్మాండ్లు పేర్కొన్నారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో జిల్లా అధ్యక్షుడు వీరబోయిన మల్లేశ్‌యాదవ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 7న గోవాలో జరిగే ఓబీసీ పదో మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈమేరకు కరపత్రాలు ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లును సాధించుకోవాలని పిలుపునిచ్చారు. తడక కమలాకర్, బండారి బాల్‌రెడ్డి, బట్టు ప్రవీణ్, బోయిన శ్రీనివాస్, ప్రసాద్, కొండయ్య, విఠల్, రవీందర్ పాల్గొన్నారు.

పోస్టర్లు ఆవిష్కరణ

పోస్టర్లు ఆవిష్కరణ

పోస్టర్లు ఆవిష్కరణ