
నాణ్యత ప్రమాణాలు పాటించాలి
● ఈవో రాధాభాయి
వేములవాడ: ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆలయ ఈవో రాధాభాయి ఉద్యోగులను హెచ్చరించారు. ఆలయంలోని పలు విభాగాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులతో మర్యాద పూర్వకంగా మాట్లాడుతూ వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రధానాలయంలోని చెక్‌పోస్టులు, ప్రసాదాల తయారీ విభాగం, ప్రసాదాల విక్రయ విభాగం, ప్రొటోకాల్ విభాగం, సెంట్రల్ గోదాం, బుకింగ్ కౌంటర్, ప్రచారశాఖ, భక్తుల సమాచార కేంద్రాల్లో నిర్వహణను పరిశీలించారు. రికార్డులు సరిగ్గా నిర్వహించాలని సూచించారు.