‘ఫ్యాన్‌’కు ఓటేస్తేనే సుపరిపాలన | - | Sakshi
Sakshi News home page

‘ఫ్యాన్‌’కు ఓటేస్తేనే సుపరిపాలన

Oct 24 2026 9:44 AM | Updated on Oct 24 2026 9:44 AM

‘ఫ్యాన్‌’కు ఓటేస్తేనే సుపరిపాలన

చీమకుర్తి నెహ్రూనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి,

మేరుగు నాగార్జున, మేడగం శ్రీదేవి, సోమా శైలజ, బొడ్డుబోయిన లీలావతి, నాయకులు

చీమకుర్తి అంబేడ్కర్‌నగర్‌లో ఓట్లు అభ్యర్థిస్తున్న బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బూచేపల్లి వెంకాయమ్మ, మేరుగు నాగార్జున, మేడగం శ్రీదేవి, దుడ్డు కోటేశ్వరమ్మ, దుడ్డు అంజమ్మ, నాయకులు

చీమకుర్తి రూరల్‌: ఎన్నికలంటే ఐదేళ్ల భవిష్యత్తును నిర్ణయించే ప్రజా తీర్పని.. అందుకే మంచి చేసే నాయకులనే ఎన్నుకోవాలని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేస్తేనే సుపరిపాలన అందుతుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. చీమకుర్తి మున్సిపాలిటీలోని 8, 9 వార్డుల్లో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, 8 వార్డు అభ్యర్థి సోమా శైలజ, 9 వార్డు అభ్యర్థి బొడ్డుబోయిన లీలావతితో కలిసి శుక్రవారం ఉదయం బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లతో బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తామని, వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఎన్నికల సందర్భంగా పట్టణ ప్రజలకు ఇస్తున్న హామీలన్నీ అమలు చేస్తామని చెప్పారు. ప్రస్తుత సీఎం చంద్రబాబు మాదిరిగా ఇచ్చిన హామీలను మరిచి ప్రజలను మోసం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో ఆనాటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాదిరిగా ప్రతి ఒక్క హామీని అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని అన్నారు. చీమకుర్తి పట్టణ ఓటర్లంతా ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవితో పాటు 28 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మేరుగు నాగార్జున మాట్లాడుతూ ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజలను మోసగించే కూటమి పార్టీ అభ్యర్థులను కాకుండా ప్రజా సమస్యలపై అవగాహన కలిగి ఉండి పట్టణ అభివృద్ధిపై స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను ఆదరించాలని ఓటర్లను కోరారు. వైఎస్సార్‌ సీపీతోనే ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని, మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవితో పాటు కౌన్సిల్‌ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పట్టణం అభివృద్ధి చెందుతుందని అన్నారు. తొలుత వార్డు అభ్యర్థుల ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కలిసి పూల వర్షంతో బూచేపల్లి, మేరుగు, మేడగంకు ఘనంగా స్వాగతం పలికారు.

1, 5 వార్డుల్లో...

చీమకుర్తి పట్టణంలోని 1, 5 వార్డుల్లో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్‌ సీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గ ఇన్‌చార్జి మేరుగు నాగార్జున, పార్టీ సీఈసీ సభ్యురాలు బూచేపల్లి వెంకాయమ్మ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థి మేడగం శ్రీదేవి, 1వ వార్డు అభ్యర్థి దుడ్డు కోటేశ్వరమ్మ, 5వ వార్డు అభ్యర్థి దుడ్డు అంజమ్మ ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. వైఎస్సార్‌ సీపీ ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి చైర్‌పర్సన్‌ అభ్యర్థితో పాటు 28 వార్డుల కౌన్సిలర్‌ అభ్యర్థులను గెలిపించా లని ఓటర్లను కోరారు. వార్డు అభ్యర్థులు గోపారపు పూర్ణచంద్రరావు, సోమా శేషాద్రి, మూలే కృష్ణకుమారి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కిష్టపాటి శేఖర్‌రెడ్డి, జిల్లా బీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి తెల్లమేకల గాంధీ, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వేమా శ్రీనివాసరావు, నాయకులు మంచ హరికృష్ణ, కంజుల ప్రతాపరెడ్డి, వేణు, బెల్లం వెంకటరావు, కాజా మొహిద్దీన్‌, మేడగం హర్షిత్‌, కాశయ్య, జడ రాజు, కిష్టపాటి శ్రీనివాసరెడ్డి, సూరి శ్రీను, పొన్నపల్లి నాగేశ్వరరావు, తప్పెట బాబూరావు, సూరి శీను, దుడ్డు మార్కు, దాసరి సుబ్బరాయుడు బొత్తుల రమేష్‌, మాణిక్యం, బొంత వెంకటేశ్వ ర్లు, కడి మంకమ్మ, ధర్నాసి సోనియా, అంకిత, మాజీ కౌన్సిలర్లు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను గెలిపించండి

చీమకుర్తి మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి పిలుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement