27 స్థానాలకు 225 నామినేషన్లు ఒక్కరోజే 120 దాఖలు
ఒంగోలు సిటీ: ప్రకాశం జిల్లాలో జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ శుక్రవారం ముగిసింది. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు మొత్తం 225 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే 120 నామినేషన్లు దాఖలైనట్లు అధికారిక నివేదిక వెల్లడించింది. ఇప్పటి వరకు నమోదైన నామినేషన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 101 మంది, వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 79 మంది నామినేషన్లు వేశారు.
పార్టీలు, స్వతంత్రుల వారీగా..
టీడీపీ తరఫున 101, వైఎస్సార్‌సీపీ తరఫున 79 నామినేషన్లు దాఖలయ్యాయి. జనసేన పార్టీ నుంచి 11, కాంగ్రెస్ నుంచి 5, ఆమ్ ఆద్మీ పార్టీ, బీఎస్పీ, బీజేపీ, సీపీఎంల నుంచి మూడేసి నామినేషన్లు నమోదయ్యాయి. ఇతర పార్టీల నుంచి ఒక నామినేషన్ దాఖలైంది. స్వతంత్ర అభ్యర్థులుగా 16 మంది నామినేషన్లు వేశారు. మొత్తంగా 27 జెడ్పీటీసీ స్థానాలకు ఇప్పటి వరకు 225 నామినేషన్లు నమోదయ్యాయి. నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసిన అనంతరం అభ్యర్థుల తుది బరిలో ఎంత మంది ఉంటారో స్పష్టత రానుంది.
ఎంపీటీసీ స్థానాలకు 1977 మంది నామినేషన్లు
జిల్లా వ్యాప్తంగా 27 మండలాల్లో టీడీపీకి 943 మంది, వైఎస్సార్ సీపీకి 794 మంది, ఇతరులు 240 మంది చొప్పున మొత్తం 1977 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.


