– IIలో..
ఒంగోలు టౌన్: పాలనలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా రాష్ట్రంలో దాడులు, అరాచకాలతో భయాందోళనలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేయకుండా మూడు రకాల ప్లాన్‌లను అమలు చేస్తున్నారని తెలిపారు. ఎంపీ మిధున్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేల మీద దాడులు చేయడం, అల్లర్లు సృష్టించడం ద్వారా దర్శి, పల్నాడు, రాయలసీమల్లో నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం చేశారని వివరించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు పోలీసు ఎన్‌ఓసీ, పంచాయతీ నో డ్యూ సర్టిఫికెట్లు సమర్పించాలని నిబంధన పెట్టారని, ఎవరైనా వైఎస్సార్ సీపీ తరఫున పోటీ చేయడానికి ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేసుకుంటే వారింటికి పోలీసులు వెళ్లి బెదిరింపులకు
వైఎస్సార్ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా ఆటంకాలు
అభ్యర్థులకు నామినేషన్లు వేయవద్దని పోలీసుల బెదిరింపులు
దర్శిలో ఎస్సై మీద దాడి చేశారని 131 మంది మీద అక్రమంగా కేసులు నమోదు
ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు కుయుక్తులు
నామినేషన్లు వేయడానికి, వేసిన అభ్యర్థులకు రక్షణ కల్పించడానికి కలెక్టర్ భరోసా ఇవ్వాలి
కనిగిరిలో ప్లాన్ ప్రకారమే నామినేషన్ తిరస్కారం
విలేకరుల సమావేశంలో దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి


