నామినేషన్ల అడ్డగింత | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల అడ్డగింత

Oct 23 2026 7:18 AM | Updated on Oct 23 2026 7:18 AM

ఓటమి భయంతోనే

ఓటమి భయంతోనే

కందుకూరు రూరల్‌: ‘ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరులో పాత రోజులను గుర్తు చేస్తున్నార’ని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ సీపీ కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌రావు అన్నారు. కందుకూరు వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందుకూరులో కొత్త శకం మొదలైందన్నారు. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ఇటువంటి దౌర్జన్యాలు ఉండేవన్నారు. మళ్లీ ఆ సాంప్రదాయాన్ని ఇంటూరి నాగేశ్వరరావు రూపంలో కందుకూరు ప్రజలకు చూపిస్తున్నారని గుర్తు చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు తీసుకువస్తే కేంద్రాల వద్ద 100 నుంచి 200 మంది టీడీపీ గూండాలను ఈ మండలం నుంచి ఆ మండలానికి..ఆ మండలం నుంచి ఈ మండలానికి తరలిస్తున్నారని మండిపడ్డారు. గుడ్లూరుకు కావలి నుంచి మనుషులను రప్పించుకుని నామినేషన్లు వేసే దగ్గర, చుట్టుపక్కల పెట్టి కార్యాలయంలోకి నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం పోలీసుల కర్తవ్యంగా మారిందన్నారు. ఏదో ఒక విధంగా లోపలికి వెళితే అక్కడ అభ్యర్థులపై దాడి చేయడం, నామినేషన్‌ పేపర్లు చించివేయడం, బయటకు నెట్టడం వంటివి చేస్తున్నారన్నారు. ఎన్‌ఓసీలు ఇచ్చే అధికారులు అధికార పార్టీ నేతలు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ఏ పేపర్‌ ఇచ్చినా బదిలీ లేదా సస్పెండ్‌ చేయిస్తామని బెదిరిస్తున్నారని, ఇదే సంస్కృతి అని ప్రశ్నించారు. రెండున్నరేళల్లో ఎంతో అభివృద్ధి చేశానని ఎమ్మెల్యే ఇంటూరి మీడియా ముందు ఉదరగొట్టేవారని, మరీ అంత అభివృద్ధి చేస్తే ఇంత భయం దేనికన్నారు. దమ్ము ధైర్యం ఉంటే రౌడీయిజం లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్‌ వేయనీయకుండా పోలీసులకు పచ్చచొక్కాలు వేసి వారితో రౌడీయిజం చేయిస్తున్నావని, ఇదే సంస్కృతి అని మండిపడ్డారు. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదని, ప్రజలంతా గమనిస్తున్నారని విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

అవినీతి, అక్రమాల వల్లే భయం..

నియోజకవర్గంలో ఇసుక, మట్టి, బియ్యం, లిక్కర్‌ మాఫియాతో పాటు గుడ్లూరులో కల్తీ మద్యం కూడా తయారు చేశారన్నారు. ఎన్ని రకాలుగా అవినీతి చేయ్యాలో అన్ని రకాలుగా అవినీతి చేసి పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయారు. దీంతో ఎన్నికలకు వెళితే ఓడిస్తారనే భయంతోనే వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటున్నారన్నారు. గుడ్లూరులో జరిగిన సంఘటనపై ఎన్నిక కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. నామినేషన్‌ కేంద్రంలో గుండాలు, కార్యకర్తలను పెట్టి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకుంటున్న పోలీసులు, అధికారులపై నివేదిస్తామన్నారు.

అభివృద్ధని ఊదరగొడుతున్నావ్‌ కదా..పోటీకి భయమెందుకు

కందుకూరులో పాత రోజులు గుర్తు చేస్తున్న ఎమ్మెల్యే ఇంటూరి

ఈ సంస్కృతిని చూసే 30 ఏళ్లు టీడీపీని దూరంగా పెట్టారు

దమ్ముధైర్యం ఉంటే ఎన్నికల్లో పోటీకి దిగాలి

నామినేషన్‌ కేంద్రాల వద్ద వందల సంఖ్యలో టీడీపీ గూండాలు

పోలీసులు పచ్చ చొక్కా చేసుకొని డ్యూటీ

గుడ్లూరు సంఘటనపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం

మాజీ ఎమ్మెల్యే, కందుకూరు ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ ధ్వజం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement