కూటమిని ఓడించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కూటమిని ఓడించడమే లక్ష్యం

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

సమావేశానికి హాజరైన వైఎస్సార్‌ సీపీ కార్యకర్తలు, నాయకులు

కార్యకర్తలను ఉద్దేశించి మట్లాడుతున్న ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

● ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌

పుల్లలచెరువు: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ స్థానాల్లో వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పార్టీ నాయకులు శక్తి వంచన లేకుండా పనిచేయాలని యర్రగొండపాలెం శాసనసభ్యుడు, పార్టీ రాష్ట్ర అధికారి ప్రతినిధి తాటిపర్తి చంద్రశేఖర్‌ పిలుపు ఇచ్చారు. పుల్లలచెరువులో శనివారం వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు దోమకాలు వెంకటేశ్వర్లు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీలతో పాటు గ్రామల్లో సర్పంచ్‌ స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను బరిలో నిలబెడతామని స్పష్టం చేశారు. అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని కోరారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, ప్రస్తుత కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామాల్లో ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపు నిచ్చారు.

బీసీలకు 34 శాతం అంటే ఇదేనా?

రాష్ట్రంలో బీసీలను కూటమి నాయకుడు చంద్రబాబు మోసం చేస్తున్నారని, బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం మేరకు సీట్లు ఇస్తానని నమ్మబలికి నేడు పుల్లలచెరువు మండలంలోని 19 సర్పంచ్‌ స్థానాలు ఉండగా ఒక్క స్థానం కూడా ఇవ్వలేదన్నారు. ఇదేనా బీసీలకు ఆత్మగౌరవం అంటే, రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బీసీలకు అన్యాయం జరిగిందని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో బీసీలకు ఎంత స్థానం ఎందో నేడు కూటమి ప్రభుత్వంలో బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని ఆలోచన చేయాలని ఎమ్మెల్యే కోరారు.

పుల్లలచెరువు రెండో పులివెందుల కావాలి

పుల్లలచెరువు మండలాన్ని రాష్ట్రంలో రెండో పులివెందులుగా చెబుతుంటారని, ఎప్పడూ పుల్లలచెరువు మండలం వైఎస్సార్‌ సీపీ అడ్డాగానే పేరు తెచ్చుకుందని, త్వరలో జరిగే స్థానిక ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ సీపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు స్థానిక ఎన్నికల్లో అభ్యర్థులు గెలిచి ఆయనకు కానుకగా ఇవ్వాలన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకులు చేస్తున్న మోసాలను, అన్యాయాలను ప్రజలు గమనిస్తున్నారని, రాబోయో ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెబుతారని ఎమ్మెల్యే తాటిపర్తి హెచ్చరించారు.

మిథున్‌రెడ్డిపై దాడికి ఖండన

వైఎస్సార్‌ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తాటిపర్తి చంద్రశేఖర్‌ పేర్కొన్నారు. ఎంపీ స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధిపై దాడి జరగడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమన్నారు. ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేస్తూ ప్రజల తరఫున పని చేసే వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి అణిచివేత చర్యలకు పాల్పడినా వైఎస్సార్‌ సీపీ ప్రజా స్వామ్య పద్ధతుల్లో ప్రజల పక్షాన నిలబడి ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీవింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ బి.సుబ్బారెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్‌ జాయింట్‌ సెక్రటరీ ఎల్‌.రాములు, మాజీ జెడ్పీటీసీ వాగ్యానాయక్‌, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.జానకి రఘు, మాజీ సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి, ఆవుల కోటిరెడ్డి, వెంకటేశ్వరనాయక్‌, ద్వారకచర్ల కోటిరెడ్డి, యండ్రపల్లి స్వామి, ఆవుల రవణారెడ్డి, పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ కృష్ణ, మహిళా మండల అధ్యక్షరాలు రమణమ్మ, యూత్‌ అధ్యక్షుడు కె.దినేష్‌ యాదవ్‌, నాయకులు జక్క వెంకటేశ్వర్లు, నాసర్‌రెడ్డి, ప్రసాద్‌, పంది గంగరాజు, ఏడుకొండలు, లక్ష్మానాయక్‌, చరణ్‌రెడ్డి, నాసర్‌రెడ్డి, గాలిరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement