ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

● వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి

ఒంగోలు సిటీ: రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, కూటమి ప్రభుత్వం గూండాగిరితో ఎన్నికలు జరుపుతోందని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు ధ్వజమెత్తారు. శనివారం ఒంగోలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎలాంటి గొడవలు లేకుండా ఎన్నికలు జరపాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌పై ఉందన్నారు. ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున అభినందనలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు ఉన్నారనే భయంతో నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులు, వైఎస్సార్‌ సీపీ నాయకులపై టీడీపీ దాడులు చేస్తోందని విమర్శించారు. పుంగనూరు, ధర్శవరంలో జరిగిన సంఘటనలే దీనికి నిదర్శమన్నారు. అధికారపార్టీ దాడులతో నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులు, నాయకులపై దాడులు చేస్తే వైఎస్సార్‌ సీపీ ఊరుకోదని హెచ్చరించారు. ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ ఎన్నికను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వివిధ సమస్యలపై వైఎస్సార్‌ సీపీ పోరాటాలు చేస్తోందన్నారు. కుప్పం ప్రసాద్‌ గెలుపునకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వై.వెంకటేశ్వర్లు, ఒంగోలు నగర అధ్యక్షుడు కఠారి శంకరరావు, కొత్తపట్నం మండల అధ్యక్షుడు లంకపోతు అంజిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ నాయకులు మల్లికార్జున్‌, జనార్దన్‌, నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement