స్కేటింగ్‌లో శర్విన్‌కు రెండు గోల్డ్‌మెడల్స్‌ | - | Sakshi
Sakshi News home page

స్కేటింగ్‌లో శర్విన్‌కు రెండు గోల్డ్‌మెడల్స్‌

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

స్కేటింగ్‌లో శర్విన్‌కు రెండు గోల్డ్‌మెడల్స్‌ మార్కాపురం టౌన్‌, రూరల్‌ పోలీసుస్టేషన్‌ల తనిఖీ మున్సిపల్‌ ఎన్నికల అబ్జర్వర్‌గా హెప్సిబా రాణి

మార్కాపురం: జిల్లాస్థాయి స్కేటింగ్‌ పోటీల్లో మార్కాపురానికి చెందిన విద్యార్థి శర్విన్‌ రెండు బంగారు పతకాలు గెల్చుకున్నాడు. రాష్ట్రస్థాయి స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం మార్కాపురం మార్కెట్‌ యార్డులో నిర్వ హించిన పోటీల్లో 2 విభాగాల్లో పాల్గొని ప్రతిభ కనబరిచి బంగారు పతకాలు సాధించాడు.

● పోలీసులకు పలు సూచనలు చేసిన ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా

మార్కాపురం టౌన్‌: మార్కాపురం పట్టణ, రూరల్‌ పోలీసుస్టేషన్‌లను ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీసుస్టేషన్‌ల్లో రికార్డులు పరిశీలించారు. పోలీసుస్టేషన్‌ ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీసుస్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని సూచించారు. ఇచ్చిన ఫిర్యాదును మానవతా దృక్పథంతో పరిష్కరించాలన్నారు. మున్సిపల్‌ ఎన్నికల సందర్భంగా విధుల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని ఆదేశించారు. ఈయన వెంట డీఎస్పీ నిమ్మగడ్డ సత్యనారా యణ, సీఐ అల్తాఫ్‌ హుస్సేన్‌, ఎస్సైలు విశ్వనాథరెడ్డి, వేమన, పోలీసు సిబ్బంది ఉన్నారు.

ఒంగోలు సబర్బన్‌: ప్రకాశం జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు అబ్జర్వర్‌గా రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ శాఖ స్పెషల్‌ సెక్రటరీ హెప్సిబా రాణిని ఎన్నికల కమిషన్‌ నియమించింది. అందులో భాగంగా ఆమె శనివారం జిల్లా కేంద్రం ఒంగోలుకు వచ్చారు. ఒంగోలు వచ్చిన అబ్జర్వర్‌ ప్రకాశం భవన్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అబ్జర్వర్‌ను డీఆర్‌ఓ వెంకటరమణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ముప్పూరి వెంకటేశ్వరరావు, హౌసింగ్‌ శాఖ పీడీ శ్రీనివాస్‌తో పాటు తదితరులు కలిసి స్వాగతం పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement