జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు | - | Sakshi
Sakshi News home page

జనసేన నుంచి వైఎస్సార్‌ సీపీలోకి చేరికలు

Oct 18 2026 2:36 AM | Updated on Oct 18 2026 2:36 AM

● 50 మందిని ఆహ్వానించిన ఇన్‌చార్జి చుండూరి

ఒంగోలు సిటీ: ఒంగోలు నగరంలోని 35వ డివిజన్‌కు చెందిన జనసేన పార్టీ డివిజన్‌ అధ్యక్షుడు పసుపులేటి మురళీకృష్ణ (నాయుడు)తో పాటు ఆయన అనుచరులు సుమారు 50 మంది శనివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వైఎస్సార్‌ సీపీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. 35వ డివిజన్‌ అధ్యక్షుడు పసుపులేటి మురళీకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది అనుచరులు వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా చుండూరి రవిబాబు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రవిబాబు మాట్లాడుతూ విద్యావేత్త పసుపులేటి మురళీకృష్ణ జనసేన పార్టీ నుంచి తమ పార్టీలోకి రావడం చాలా సంతోషమన్నారు. కూటమిలో భాగస్వాములైన మురళీకృష్ణ వంటి నాయకులకు అన్యాయం జరిగిందన్నారు. తాము చదువుకున్న వారి ప్రోత్సహించాలని, రాజకీయాల పట్ల నిబద్ధత ఉన్న మురళీకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి 35 డివిజన్‌ కార్పొరేటరుగా ప్రకటించామన్నారు. 35వ డివిజన్‌ ప్రజలందరూ మురళీకృష్ణ నమ్మకమైన వ్యక్తి అని, పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అన్నారు. ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వ్యక్తి అని కొనియాడారు. ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌, 35వ డివిజన్‌ అభ్యర్థి పసుపులేటి మురళీకృష్ణ గెలిపించాలని కోరారు. అంతకు ముందు పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకరరావు మాట్లాడుతూ నామినేషన్‌ వేస్తున్న అభ్యర్థులపై, నాయకుల మీద టీడీపీ నాయకులు దాడులు చేస్తే వైఎస్సార్‌ సీపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఒంగోలు నగర మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ను నగర ప్రజలు గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, ఒంగోలు పార్లమెంట్‌ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ పరిశీలకులు వెంకటేశ్వర్లు నాయుడు, ఒంగోలు మేయర్‌ అభ్యర్థి కుప్పం ప్రసాద్‌ పాల్గొన్నారు.

నాగులుప్పలపాడు మండలంలో..

● కూటమి నుంచి చేరిన వారిని ఆహ్వానించిన మాజీ మంత్రి మేరుగు నాగార్జున

నాగులుప్పలపాడు: మండలంలోని చదలవాడ, అగ్రహరం చీర్వానుప్పలపాడు గ్రామాల్లోని టీడీపీ, జనసేన పార్టీల నుంచి పలువురు నాయకులు శనివారం వైఎస్సార్‌ సీపీ సంతనూతలపాడు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి మేరుగు నాగార్జున సమక్షంలో ఆ పార్టీలో చేరారు. చదలవాడ గ్రామానికి చెందిన గూడూరి పోతురాజు తన అనుచరలతో జనసేన పార్టీ నుంచి, అగ్రహారం గ్రామానికి చెందిన బత్తుల అంజయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి మేరుగు నాగార్జున, మండల నాయకుల సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరారు. వీరికి సమన్వయకర్త మేరుగ నాగార్జున పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు నలమలపు కృష్ణారెడ్డి, ఇనగంటి పిచ్చిరెడ్డి, మారెళ్ల బంగారుబాబు, పోలవరపు శ్రీమన్నారాయణ, పొద పవన్‌, తోకల శ్రీను, జిలకర కిరణ్‌, కోడె సుబ్బయ్య, మల్లెల నాగరాజు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement