జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ
ఒంగోలు సిటీ: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని జెడ్పీ మాజీ చైర్‌పర్సనన్ బూచేపల్లి వెంకాయమ్మ అన్నారు. గాంధీజీ 157వ జయంతి, లాల్‌బహదూర్ శాస్త్రి 122వ జయంతి సందర్భంగా గురువారం ఒంగోలులోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా కార్యాలయంలో వారి చిత్రపటాలకు ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ ఇన్‌చార్జి చుండూరి రవిబాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, మాజీ పీడీసీసీబీ చైర్మన్ మాదాసి వెంకయ్య, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ.రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు, నగర అధ్యక్షుడు కటారి శంకరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బూచేపల్లి వెంకాయమ్మ మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహ మార్గాల ద్వారా స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలిచారని తెలిపారు. ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్రం అనంతరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నేతృత్వంలో రాజ్యాంగ నిర్మాణం, జవహర్‌లాల్ నెహ్రూ, లాల్‌బహదూర్ శాస్త్రి తదితర నాయకుల కృషితో దేశం వివిధ రంగాల్లో అభివృద్ధి సాధించిందని పేర్కొన్నారు. ఒంగోలు నియోజకవర్గ ఇన్‌చార్జ్ చుండూరి రవిబాబు మాట్లాడుతూ లాల్‌బహదూర్ శాస్త్రి నిరాడంబరత, నిజాయితీ, బాధ్యతాయుతమైన ప్రజాజీవితానికి ఆదర్శంగా నిలిచారన్నారు. కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కటారి శంకరరావు, బాలల హక్కుల కమిషన్ మాజీ సభ్యురాలు బత్తుల పద్మావతి, మాజీ కార్పొరేటర్ ఇమ్రాన్‌ఖాన్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, ఒంగోలు అసెంబ్లీ లీగల్ సెల్ అధ్యక్షుడు ధర్నాసి హరిబాబు, వైఎస్సార్ సీపీ నాయకులు దుంపా చెంచిరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పల్నాటి రవీంద్రారెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు వీ వెంకటేశ్వరరెడ్డి, చందోలు చెంచిరెడ్డి, పల్నాటి వెంకటేశ్వరరెడ్డి, యరజర్ల రమేష్, మాల్యాద్రిరెడ్డి, ఆనం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డీ క్రాంతికుమార్, వై.వి.అశోక్, అంజిరెడ్డి, కరుణాకర్, పి.ప్రసాద్, బి.శ్రీనివాసరెడ్డి, ముత్యాల నాయుడు, బడుగు శోభలత పాల్గొన్నారు.


