ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం | - | Sakshi
Sakshi News home page

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం

Oct 3 2026 1:56 AM | Updated on Oct 3 2026 1:56 AM

ఆత్మరక్షణకు తైక్వాండో దోహదం ● జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ తైక్వాండో ఎంపికలు డిగ్రీ రెండో సంవత్సర పరీక్ష ఫలితాలు విడుదల ● వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి వాల్మీకి సంఘ జిల్లా అధ్యక్షునిగా లింగేష్‌

● జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ తైక్వాండో ఎంపికలు

కందుకూరు రూరల్‌: తైక్వాండో వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ క్రీడలు విద్యార్థుల్లో ఆత్మరక్షణ, క్రమశిక్షణ, శారీరక దారుఢ్యానికి ఎంతగానో దోహదపడతాయని తైక్వాండో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఉన్నం వీరాస్వామి అన్నారు. కందుకూరు పట్టణంలోని ఇస్లాంపేట షాదీఖానాలో జిల్లా స్థాయి స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (ఎస్‌జీఎఫ్‌) తైక్వాండో అండర్‌ 14, 17, 19 విభాగాలకు జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని నలుమూలల నుంచి సుమారు 200 మంది క్రీడాకారులు ఎంపికకు హాజరైనట్లు తైక్వాండో మాస్టర్‌ ఎస్‌కే.అబ్దుల్‌ సలామ్‌ తెలిపారు. అండర్‌ 14, 17, 19 విభాగాల్లో ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14 తేదీల్లో అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఎస్‌జీఎఫ్‌ జిల్లా కార్యదర్శి రాజ్యలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఉప్పుటూరి శ్రీనివాసులు, తైక్వాండో అసోసియేషన్‌ చైర్మన్‌ గోనుగుంట వెంకటేశ్వర్లు, ఆక్స్‌ఫర్డ్‌ డైరెక్టర్‌ బాల భాస్కర్‌ పాల్గొన్నారు.

ఒంగోలు సిటీ: ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయంలోని డిగ్రీ రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ డీవీఆర్‌ మూర్తి శుక్రవారం విడుదల చేశారు. బీఏ, బీకాం కంప్యూటర్స్‌, బీకాం బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ డీఎస్సీ బీబీఏ తదితర 7 కోర్సుల పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. మొత్తం 50.1 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు.

నాగులుప్పలపాడు: వాల్మీకి సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కుందా లింగేష్‌ను ఎంపిక చేసినట్లు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు తెలిపారు. గుంటూరులో శుక్రవారం నిర్వహించిన వాల్మీకి సంఘ సమావేశంలో ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా కుందా లింగేష్‌ను నియమించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement